DAV School: డీఏవీ స్కూల్‌పై వెనక్కి తగ్గనంటున్న ప్రభుత్వం, రేపే కీలక భేటీ - నిర్ణయం మారుతుందా?
స్కూల్ గుర్తింపు రద్దుపై వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 5వ తరగతి వరకు పర్మిషన్ తీసుకొని ఏడో తరగతి వరకు వారు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
Hyderabad DAV School Incident: హైదరాబాద్‌లోని డీఏవీ స్కూలు (DAV School Incident) ఘటనలో ప్రభుత్వం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఆ స్కూలు గుర్తింపును విద్యాసంవత్సరం మధ్యలో రద్దు చేస్తే అక్కడ చదువుతున్న పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆ మేరకు కొన్ని అభ్యర్థనలు వస్తున్నా, ప్రభుత్వం స్కూలు గుర్తింపు రద్దుకే మొగ్గు చూపుతోంది. స్కూల్ గుర్తింపు రద్దుపై వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. డీఏవీ స్కూల్ నిర్వహణలో అనేక ఉల్లంఘనలను గుర్తించామని, 5వ తరగతి వరకు పర్మిషన్ తీసుకొని ఏడో తరగతి వరకు వారు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అలాగే సీబీఎస్‌ఈ సిలబస్ నిర్వహణలోనూ సరిగ్గా అనుమతులు లేనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో రేపు (అక్టోబరు 26) హైదరాబాద్ డీఈవో (జిల్లా విద్యాధికారి)తో స్కూల్ డైరెక్టర్లు భేటీ కానున్నారు. స్కూల్ గుర్తింపు రద్దును వెనక్కి తీసుకోవాలని పేరెంట్స్ ఇచ్చిన వినతి పత్రాలను స్కూలు మేనేజ్‌మెంట్ డీఈవోకు అందజేయనుంది. అయితే, కఠిన చర్యలు తీసుకుంటేనే మిగతా స్కూళ్లు కూడా నిబంధనలు పక్కాగా పాటిస్తాయని విద్యాశాఖ భావిస్తోంది.
డీఏవీ ఘటన తర్వాత విద్యా శాఖ కార్యదర్శి అధ్యక్షతన మంత్రి సబిత అధ్యక్షతన కమిటీ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలపై సబితా ఇంద్రారెడ్డితో ఈ కొత్త కమిటీ భేటీ కానుంది. బంజరాహిల్స్ డీఏవీ స్కూల్ (DAV School Incident) వంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ నివేదించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం
బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూలు DAV School Incident లో ఎల్‌కేజీ చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ వాహన డ్రైవర్ రజనీ కుమార్ (34) లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. స్కూలులో ప్రిన్సిపల్ రూమ్ సమీపంలోని డిజిటల్ తరగతి గదిలోనే ఆ డ్రైవర్ చిన్నారిపై లైంగిక దాడి చేసినా ప్రిన్సిపల్ మాధవి (56) నిరోధించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని పోలీసులు ఆమెపై కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరికీ స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించారు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే స్కూల్ రద్దుతో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు కోరారు.
Also Read: WhatsApp Server Down: సడెన్‌గా వాట్సప్ సేవలు డౌన్, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి! తికమకలో యూజర్లు
Also Read: Whatsapp Down Memes : వాట్సాప్ డౌన్ - సోషల్ మీడియా స్పందన చూస్తే నవ్వాపుకోలేరు !