WhatsApp Server Down: సడెన్‌గా వాట్సప్ సేవలు డౌన్, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి! తికమకలో యూజర్లు
వాట్సప్ సేవలకు దేశ వ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. మంగళవారం (అక్టోబరు 25) ఉన్నట్టుండి మధ్యాహ్నం 12.30 సమయంలో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి.
వాట్సప్ సేవలకు దేశ వ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. మంగళవారం (అక్టోబరు 25) ఉన్నట్టుండి మధ్యాహ్నం 12.30 సమయంలో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. తమ మొబైల్ లో నెట్ వర్క్ పని చేయడం లేదేమోనని సందేహంతో ఫోన్లను స్విచ్చాఫ్ లేదా రీస్టార్ట్ చేశారు. అయినా అదే సమస్య కొనసాగింది. వాట్సప్ సేవలు నిలిచిపోయినట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
ఆగిపోయిన ఐదు నిమిషాల్లో ప్రపంచం అంతా గగ్గోలు
ఏదైనా మెసేజ్ పంపగానే సింగిల్ టిక్ మార్క్ కూడా రాకపోవడాన్ని యూజర్లు ఎదుర్కొన్నారు. ఫోన్ లో వాట్సప్ యాప్ మాత్రమే కాకుండా, వాట్సప్ వెబ్ కూడా పని చేయడం ఆగిపోయింది. [
WhatsApp disruptions reported in India, Meta says working to restore services soon
— ANI Digital (@ani_digital) October 25, 2022
Read @ANI Story | https://t.co/WKc4Pkehmr#Whatsapp #WhatsAppDown #Whatsapp #Meta #WhatsappIndia pic.twitter.com/3GQCAbbe0a
వాట్సాప్‌కు వచ్చి న సమస్యేమిటి ?
వాట్సాప్ నిలిచిపోయిన సమస్య ఒక్క ఇండియాకే పరిమితం కాలేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సర్వర్లలో వచ్చిన సమస్య కారణంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయినట్లుగా మెటా కూడా అధికారికంగా ధృవీకరించింది. వీలైనంత త్వరగా సేవలు పునంప్రారంభిస్తామని ప్రకటించింది. అయితే సమస్యకు కారణం ఏమిటో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా. ఫేస్ బుక్ కూడా ఈ సంస్థదే. వాట్సాప్ సేవలను ఇటీవల కొన్ని వెర్షన్ల ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లకు సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్‌లలో కొన్ని వెర్షన్లకు వాట్సాప్ నిలిపివేశారు. ఆ ప్రక్రియలో జరిగిన తప్పుల వల్ల.. మొత్తం వాట్సాప్ సర్వీస్‌కే ఇబ్బంది కలిగిందన్న వాదన వినిపిస్తోంది. అయితే మెటా సంస్థ వరకు ఇంత వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
వాట్సాప్ లేకపోతే గందరగోళమే
ప్రస్తుతం వాట్సాప్ సేవలు విస్తృతంగా ఉన్నాయి. వ్యక్తుల మధ్యే కాకుండా వ్యాపార సంస్థలు కూడా తమ రోజువారీ వ్యవహారాలను వాట్సాప్ కేంద్రంగా నిర్వహిస్తున్నాయి. సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో కీలకంగా ఉంటోంది. వాట్సాప్ ఆగిపోవడం వల్ల మొత్తం సమాచార వ్యవస్థ స్తంభించినట్లు అయింది. ఇతర యాప్‌లు ...ఏవీ వాట్సాప్‌తో పోటీ పడే స్థాయిలో లేదు. గతంలో వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్‌ను తెచ్చినప్పుడు.. ఇతర యాప్‌లను ప్రజలు విస్తృతంగా డౌన్ లోడ్ చేసుకున్నారు కానీ.. వాటిని వినియోగించడం లేదు. వాట్సాప్ లో కనీసం పది శాతం మంది సబ్ స్క్రయిబర్లను ఇతర యాప్‌లు పొందలేకపోయాయి. ప్రస్తుతం వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది వరకూ ఉపయోగిస్తున్నారు. అంత కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మెసెజులు పంపించుకుంటూ ఉంటారు. వీటన్నింటికీ అంతరాయం ఏర్పడింది.