Telangana: ఇకపై వారికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Fee Reimbursement: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకుంటున్న బీసీ విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు.
Fee Reimbursement For BC Students:
హైదరాబాద్: గత దశాబ్ద కాలానికి పైగా ఉమ్మడి ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులతో పాటు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన బీసీ విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
2023-24 విద్యా సంవత్సరం నుంచే ఆ బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయనుంది తెలంగాణ సర్కార్. ఈ నిర్ణయం అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం ఆదేశించారు. ఇప్పటివరకూ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక కాలేజీలలో సీట్లు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఫీజు చెల్లించేది. ఈ అకడమిక్ ఇయర్ నుంచి బీసీ విద్యార్థులకు వర్తింపచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు 10వేల మందికి పైగా బీసీ విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. సర్కార్ ఇందుకోసం ప్రతి ఏడాది అదనంగా రూ. 150 కోట్లను వెచ్చించనుందని స్పష్టం చేశారు.
అమెరికా, ఆస్ట్రేలియా, యూకే సహా తదితర దేశాల్లో అంతర్జాతీయంగా చదివే బీసీ విద్యార్థులకు ఇప్పటికే ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో పాటు తెలంగాణలో ఫీజు రీయెంబర్స్‌మెంట్ ఇస్తున్నామని మంత్రి గంగుల అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇదివరకే మొత్తం ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుండగా, తాజాగా బీసీ విద్యార్థులకు సైతం ఫీజు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, సీఎం కేసీఆర్ నాయకత్వమే అందుకు కారణమన్నారు. బీసీ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయంగా సైతం రాణించాలని, ఉన్నత చదువులతో వారు మరో మెట్టు ఎదగాలని మంత్రి గంగుల అన్నారు.
యూజీసీ- నెట్ జూన్ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2023 (యూజీసీ - నెట్) ఫలితాలను డా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫలితాలను జులై 25న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు పరీక్ష ఫైనల్ కీ, కటాఫ్ మార్కుల వివరాలను కూడా ఎన్టీఏ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో అందుబాటులో వాటిని ఉంచింది.
దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ఎన్‌టీఏ ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది. యూజీసీ నెట్ (జూన్)-2023 పరీక్షను జూన్ 13 నుంచి 22 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 83 సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా 181 నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 6,39,069 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
యూజీసీ నెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial