News
News
X

T Congress Protest: హైకోర్టు అనుమతితో ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

T Congress Protest: రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందని తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. హైకోర్టు అనుమతితో ఈరోజు ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోంది. 

FOLLOW US: 
Share:

T Congress Protest: రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందని తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు పుస్తెలు అమ్ముకున్న పరిస్థితి వచ్చిందని చెప్పారు. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తామంటే పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. కానీ హైకోర్టు అనుమతితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ వద్ద నిరసన చేస్తోందని వివరించారు. ఈ ధర్నాకు ఎంతో మంది సర్పంచులు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారని అన్నారు. గ్రామ గౌరవం పెరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గౌరవం ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలిపారు. సర్పంచులకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు. వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సర్పంచుల వాటాను వారి ఖాతాలో వేయాలని చెప్పుకొచ్చారు. వారికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం దోపీడీ చేస్తోందని ఆరోపించారు.  

60 మంది సర్పంచుల ఆత్మహత్యకు కేసీఆరే కారణం

సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవలే నిధులు రాకపోవడంతో సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. సర్పంచుల ఆత్మ గౌరవం దెబ్బతీసి వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికే ఆ నిధులను దారి మళ్లించారని ఆయన అన్నారు. సర్పంచులకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని  డిమాండ్ చేశారు. చెట్టు చనిపోతే సర్పంచ్ ను సస్పెండ్ చేస్తారట అంటూ ఎద్దేవా చేశారు. మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను ఏం చేయాలని ప్రశ్నించారు. కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల మూసీలో మునిగి 30 మంది చనిపోయారన్నారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మామూలు పరిస్థితులు లేవని.. మున్సిపల్ శాఖ మంత్రి నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని తెలిపారు. 

బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి 

రాష్ట్రాన్ని ఇంత అధ్వాన్నంగా మార్చిన తండ్రీ, కొడుకులను ట్యాంక్ బండ్ మీద ఉరేసినా తప్పు లేదంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పుట్టబోయే బిడ్డమీద కూడా లక్షా 50 వేల అప్పు పడడానికి కారణం సీఎం కేసీఆర్ అని వివరించారు. తెలంగాణ మోడల్ అంటే ఇదేనా అంటూ విమర్శించారు. బీఆరెస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదు భస్మాసుర సమితి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుద్ది మార్చుకోకపోతే ఈ భస్మాసుర సమితి కూడా కేసీఆర్ ను కాపడలేదని అన్నారు. కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు ఎక్కడైనా కట్టించారా అని అడిగారు. నీ సోకులకు వేల కోట్లు ఖర్చు చేస్తూ.. సర్పంచుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తారా అంటూ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచుల సమస్యలు తీరాలంటే కేసీఆర్ పోవాలని.. బీఆరెస్ ను బొంద పెట్టాలని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని పొలిమేరలు దాటేదాక తరమాలంటూ కామెంట్లు చేశారు. 

పనికిమాలిన చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తాంమన్నారు. సర్పంచుల నిధులు ఎవరూ దొంగిలించకుండా పటిష్ట చట్టం తీసుకొస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్.. సర్పంచుల వ్యవస్థను సర్వం నిర్వీర్యం చేశాడని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరణించిన ప్రతీ సర్పంచ్ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ప్రకటించాలని కోరారు. అడుక్కోవడం మానండి.. కోట్లాది సాధించుకుందాం అని సర్పంచులకు చెప్పారు. కేసీఆర్ దోపీడీని నిలువరించేందుకు సర్పంచులు మంచి నిర్ణయం తీసుకోండిని సూచించారు. సర్పంచులకు పూర్వ వైభవం రావాలంటే కేసీఆర్ అధికారం పోవాల్సిందేనని రేవంత్ రెడ్డి అన్నారు. 

Published at : 09 Jan 2023 04:53 PM (IST) Tags: revanth reddy on cm kcr T congress protest Revanth Reddy Telangana News Telangana Congress Party Protest

సంబంధిత కథనాలు

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

Mlc Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే, కేటీఆర్ కూడా స్పష్టం చేశారు - ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

Mlc Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే, కేటీఆర్ కూడా స్పష్టం చేశారు - ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

GHMC: హైదరాబాద్ అభివృద్ది వైపు జీహెచ్ఎంసీ వడివడిగా అడుగులు - టార్గెట్ 2024 జనవరి !

GHMC: హైదరాబాద్ అభివృద్ది వైపు జీహెచ్ఎంసీ వడివడిగా అడుగులు - టార్గెట్ 2024 జనవరి !

ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత

ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత

Karthika Deepam Serial Issue : కార్తీకదీపం సీరియల్ ఎఫెక్ట్, క్లైమాక్స్ చూస్తున్నప్పుడు విసిగించాడని కస్టమర్ వేలు కొరికిన వ్యాపారి!

Karthika Deepam Serial Issue : కార్తీకదీపం సీరియల్ ఎఫెక్ట్, క్లైమాక్స్ చూస్తున్నప్పుడు విసిగించాడని కస్టమర్ వేలు కొరికిన వ్యాపారి!

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం