By: ABP Desam | Updated at : 23 Mar 2023 12:07 PM (IST)
వీహెచ్ హౌస్ అరెస్టు (Photo Credit: Twitter)
టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయనకు ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సిట్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు సిట్ కార్యాలయానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్టులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సిట్ కార్యాలయానికి తరలివస్తే గందరగోళ పరిస్థితి నెలకొంటుందని భావించి వారిని ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్‌లు చేస్తూ నిలువరిస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, షబ్బీర్ అలీ, మల్లు రవి సహా పలువురు సీనియర్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. హిమాయత్ నగర్ లో ఉన్న సిట్ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి సిట్ ఆఫీసుకు వెళ్తున్న క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్ పీఏ హస్తం ఉందంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంతో ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు (మార్చి 23) సిట్ ఎదుట హాజరై టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆధారాలను రేవంత్ రెడ్డి అందించనున్నారు.
ప్రస్తుతం హిమాయత్ నగర్ సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్ ఆఫీస్ కు వెళ్లే రెండు దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలెవరూ రాకుండా పోలీసులు భద్రత పెంచారు. రేవంత్ వాహనాన్ని మాత్రమే సిట్ కార్యాలయం వద్దకు పోలీసులు అనుమతించనున్నారు. ఇప్పటికే కార్యాలయానికి సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ చేరుకున్నారు. ప్రస్తుతం సిట్ కార్యాలయం బయట పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఉన్నారు.
Drone Show Durgam Cheruvu: దుర్గం చెరువుపై ఆకట్టుకున్న డ్రోన్ షో, దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహణ
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు తొలగిన ఆటంకాలు, పరీక్ష వాయిదా పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
Telangana High Court: బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి భూకేటాయింపు రద్దు చేసిన హైకోర్టు!
Hyderabad News: భారత్ భవన్కు కేసీఆర్ శంకుస్థాపన, ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎక్స్లెన్స్, హెచ్ఆర్డీ కేంద్రం
TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మాజీ ఎంపీటీసీ కుమార్తె పేరు- షాకింగ్ విషయాలు చెబుతున్న డీఈ రమేష్
Vijayashanthi: విజయశాంతి బీజేపీని వీడతారంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన రాములమ్మ
కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?
Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్- ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్నాథ్
Wrestlers Protest: నిరసనల నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నారంటూ వార్తలు, ఫేక్ అని కొట్టిపారేసిన రెజ్లర్