Telangana Congress: నేడు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మల దగ్ధం, రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన కాంగ్రెస్
NSUI: ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు 18 మంది యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని అరెస్టు చేశారని వారు ఆరోపించారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయనున్నారు. నిన్న (మే 1) హైదరాబాద్‌లో కాంగ్రెస్ విద్యార్థి నాయకుల (NSUI) అరెస్టులకు నిరసనగా సోమవారం కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతల్ని నిలువరించేందుకు టీఆర్ఎస్ అన్ని చర్యలు చేపడుతోందని, అందుకే నిన్న ఎన్ఎస్‌యూఐ నేతలను అరెస్టు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించేందుకు పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఎన్ఎస్‌యూఐ నేతలు నిన్న నిరసన చేశారు. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు 18 మంది యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని అరెస్టు చేశారని వారు ఆరోపించారు. ఆదివారం బల్మూరి వెంకట్ తో సహా మొత్తం 18 మంది నాయకులను 14 రోజుల రిమాండ్ పై చంచల్ గూడ జైలుకు తరలిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దీన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వారి అరెస్టులకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సెక్షన్ 143 357 148 353 354 332 448 రెడ్ విత్ 149 కింద కేస్ నమోదు చేసిన ఓయూ పోలీస్ లు.
— Venkat Balmoor (@VenkatBalmoor) May 2, 2022
ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం, క్రిమినల్ ట్రెస్ పాస్ పలు ఆరోపణలతో సెక్షన్లు ఆడ్ చేసిన పోలీసులు pic.twitter.com/ZM4W8wUgy8
ఓయూ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ ఛాంబర్ ఎదుట చీర గాజులతో నిరసన తెలిపిన @TSNSUI అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ తో సహా 16 మంది @nsui నాయకులను కోవిడ్ టెస్టుల నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించిన అనంతరం మేజిస్ట్రేట్ ముందు వారిని హాజరుపరిచెందుకు తీసుకెళ్లిన పోలీసులు.#Adminpost pic.twitter.com/t45WnBX6MR
— Venkat Balmoor (@VenkatBalmoor) May 1, 2022
మే 7న ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన విన్నపాన్ని తిరస్కరించిన ఓయూ వైస్ చాన్సలర్ రవీందర్ యాదవ్ ఛాంబర్ ఎదుట చీర గాజులతో నిరసన తెలిపిన @TSNSUI అధ్యక్షుడు వెంకట్ బల్మూర్.#Adminpost pic.twitter.com/1gxR563Ubr
— Venkat Balmoor (@VenkatBalmoor) May 1, 2022