(Source: ECI/ABP News/ABP Majha)
Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్- నేడు అధికారిక ఉత్తర్వులు!
Revanth Reddy: తెలంగాణలో కొత్త డీజీపీగా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ జితేందర్ రానున్నారు. నిర్మల్‌లో ఎఎస్పీగా కేరీర్ ప్రారంభించిన ఆయన అనేక పదవుల్లో తన శక్తిని ప్రూవ్ చేసుకున్నారు.
Telangana DGP: తెలంగాణ పోలీస్ బాస్‌గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ జితేందర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన నియామకం దాదాపు కన్ఫామ్ అయినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ సాయంత్రానికి అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. మంగళవారమే రావాల్సిన ఉత్తర్వులు సీఎం బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడింది.
1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జితేందర్ పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించారు. ఏపీ క్యాడర్ ఆఫీసర్‌గా ఉన్న జితేందర్‌కు మొదటి పోస్టింగ్ నిర్మల్ ఏఎస్పీగా వచ్చారు. తర్వాత మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లా ఎస్పీగా కూడా పనిచేశారు. 2004-06 మధ్య గ్రేహౌండ్స్‌లో వర్క్ చేశారు. తర్వాత విశాఖ, వరంగల్ రేంజ్‌లలో డీఐజీగా, హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా, తెలంగాణ లా అండ్ ఆర్డర్ ఏ డీజీపీగా, జైళ్ల శాఖ డీజీగా విధులు నిర్వహించారు.
1992 నుంచి పోలీస్ శాఖలో ఉంటూ సేవలు అందిస్తున్న జితేందర్ 2025 సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. కొత్తగా డీజీపీ బాధ్యతలు చేపడితే 14 నెలల పాటు ఆ పదవిలో ఉంటారు. 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలలపాటు కొనసాగే అవకాశముంది. ఈయన నియామకం జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియమించిన తొలి డీజీపీ జితేందర్ అవుతారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. అప్పటి డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌ను తప్పించి ఈయనకు ఛాన్స్ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈయన్ని మార్చలేదు.