అన్వేషించండి

KTR News: నాకు ఏ ఫాం హౌస్ లేదు- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫాం హౌస్‌లు చెక్ చేద్దామా? కేటీఆర్ ఛాలెంజ్

Telangana News: తనకు ఏ ఫాం హౌస్ లేదని, స్నేహితుడి ఫాం హౌస్ లీజుకు తీసుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫాం హౌస్ ఉందని, చెక్ చేద్దామా అన్నారు.

KTR comments in Pressmeet | హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులకు ఫాం ఫౌస్‌లు ఉన్నాయని, తనకు ఏ ఫాం హౌస్ లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. స్నేహితుడి ఫాం హౌస్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. తెలంగాణలో నిబంధనలు పాటించకుండా కట్టిన ఫాం హౌస్ లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తన పేరు మీద ఏ ఫాం హౌస్ లేదని, తనకు అసలు ఫాం హౌస్ లేదని క్లారిటీ ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఫాం హౌస్ ఉంది..

తన స్నేహితుడి వద్ద లీజుకు తీసుకున్న ఫాం హౌస్ నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఒకవేళ ఆ ఫాం హౌస్ కనుక FTL, Buffer Zone లో ఉన్నట్లయితే ఫ్రెండ్ కు చెప్పి, ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించాలని కోరతానన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలకు ఫాం హౌస్ లు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. కేవీపీ, మహేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలకు ఫాం హౌస్ లు ఉన్నాయని.. అవసరమైతే అవి ఎక్కడ ఉన్నాయో చూపిస్తాయన్నారు. జన్వాడతో ఇతర ఫాం హౌస్ లపై అక్కడే కూర్చుని అన్ని వివరాలు పరిశీలించి, చర్యలు తీసుకుందామా అంటూ సవాల్ విసిరారు.

అలాగైతే ఆ ఫాం హౌస్ కూల్చేసినా ఓకే..

జన్వాడ ఫామ్ హౌస్‌ను హైడ్రా కూల్చివేస్తుందనే కథనాలపై కేటీఆర్ స్పందించారు. తన స్నేహితుడికి ఓ ఫాం హౌస్ ఉంటే తాను ఏడెనిమిదేళ్లు లీజుకు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ ఫాం హౌస్ బఫర్ జోన్‌లో ఉంటే కనుక తాను స్వయంగా వెళ్లి తన మిత్రుడితో మాట్లాడి... దగ్గర ఉండి మరీ కూలగొట్టించి వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే అందరికీ ఒకే న్యాయం ఉండాలని, ఆ ఫామ్ హౌస్ కూల్చివేసిన తర్వాత.. నేరుగా వచ్చి మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో కట్టిన నిర్మాణాలను కూడా కూల్చివేయాలని ఛాలెంజ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, మధుయాష్కీ, కేవీపీ రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డిలకు సంబంధించిన నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తమకు ఏ ఇబ్బంది లేదన్నారు. పలువురు కాంగ్రెస్ నేతల ఫాం హౌస్ లు నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయని.. తెలంగాణ ప్రభుత్వం వాటిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

రుణమాఫీ చేయమని అడిగిన రైతుల మీద కేసులు పెట్టి వాళ్లని వేధిస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.  రుణమాఫీ జరగలేదని ఆందోళన చేస్తే ఏళ్లు జైశిక్ష పడేలా సెక్షన్ 126, రెండు సంవత్సరాలు జైలుశిక్ష పడేలా సెక్షన్ 189, ఏడాది జైలుశిక్ష పడే విధంగా సెక్షన్ 223ల కింద రైతుల మీద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రుణమాఫీ అంతా బూటకమని, మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా రుణమాఫీపై కాకి లెక్కలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.

Also Read: Telangana: వరంగల్ బీఆర్‌ఎస్‌లో డిష్యూం డిష్యూం- ఒకరు కేసీఆర్‌కు సన్నిహితులు మరొకరు కేటీఆర్‌ ఫ్రెండ్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహంచీఫ్‌ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బందివినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Karimnagar: కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
Crime News: ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Embed widget