అన్వేషించండి

New Medical Collages: తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం, వర్చువల్‌గా ప్రారంభించిన కేసీఆర్

మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 8 మెడికల్‌ కాలేజీలను నేడు (నవంబరు 15) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ క్లాసుల్ని కూడా కేసీఆర్ వర్చువల్‌గానే ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్‌ కాలేజీలు వస్తాయని ఎవరూ ఊహించలేదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ చరిత్రలోనే ఇదొక కొత్త అధ్యాయంగా దీన్ని అభివర్ణించారు. ఈ మెడికల్ కాలేజీలు మంజూరు చేయించేందుకు మంత్రి హరీష్‌ రావు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు.

ఈ కాలేజీలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 2,790కి పెరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మెడికల్‌ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయని గుర్తు చేశారు. పీజీ సీట్లు కూడా 1,180కి చేరి రెట్టింపు అయ్యాయని అన్నారు. మొత్తంగా తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా మారుతోందని అన్నారు. ఈ సందర్భంగా  సీఎం కేసీఆర్‌. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, రామగుండంలలో ఈ కాలేజీలు ప్రారంభం అయ్యాయి.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. మరిచిపోలేని రోజు. ఒకనాడు అనేక సమస్యలతో త్రాగునీటికి, సాగునీటికి, కరెంటుకు, మెడికల్ సీటుకి, ఇంజనీరింగ్ సీటుకు ఎన్నో అవస్థలు పడ్డాం. మనం ఈ రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం గర్వకారణం. గతంలో మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యపేటలో 4 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం. వాటిని విజయవంతంగా నిర్వహిచుకుంటున్నాం.

ఈ రోజు సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం. మరీ ముఖ్యంగా మహబూబాబాద్ వంటి గిరిజన ప్రాంతంలో, వనపర్తి వంటి మారుమూల ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని చెప్పి కలలో కూడా ఎవరూ ఊహించలేదు. స్వరాష్ట్ర ఏర్పాటు, ఉద్యమకారులుగా పనిచేసిన బిడ్డలే తెలంగాణ పరిపాలన సారథ్యాన్ని చేపట్టడం మన కలలను సాకారం చేసింది. తెలంగాణ ఉద్యమకారుడు, వైద్యారోగ్యశాఖామాత్యులు హరీష్ రావు కృషితోనే ఈ 8 కళాశాలల నిర్మాణం రూపుదాల్చింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారికి సహకరించిన ఉన్నతాధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు. 

ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కళాశాల రావాలని మనం సంకల్పించుకున్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలల సంఖ్య 17 కు పెరిగింది. 16 జిల్లాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. మరో 17 జిల్లాల్లో నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వీటి నిర్మాణం చేపట్టేందుకు ఇన్ ప్రిన్స్ పుల్ క్యాబినేట్ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగిలిన 17 కాలేజీల నిర్మాణం కూడా చేపట్టి, భగవంతుడి మన్సిస్తే వీటి ప్రారంభోత్సవం కూడా నేనే చేస్తానని విన్నవిస్తున్నాను. గతంలో 850 ఎంబిబిఎస్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉండేవి. ఈ రోజు ఆ సంఖ్య 2,790 కి పెరిగింది. ఈ సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగి మన పిల్లలందరికీ సీట్లు లభించడం నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. అదే విధంగా పిజి సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు మనం గణనీయంగా పెంచుకున్నాం. గతంలో 531 పిజి సీట్లు ఉంటే, ప్రస్తుతం 1,180 పిజి సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో సూపర్ స్పెషాలిటీ సీట్లు 70 మాత్రమే ఉంటే, ఈ రోజు 152 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 

‘‘దీంతో విద్యార్థులకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. రత్నాల్లాంటి, వజ్రల్లాంటి విద్యార్థులకు ఇది మంచి అవకాశం. దళిత, గిరిజన, బడుగు బలహీన, బిసి, మైనార్టీ  విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం. జనాభా నిష్పత్తికి అనుగుణంగా డాక్టర్లు అందుబాటులో ఉండడం ఎంత అవసరమో, పారా మెడికల్ సిబ్బంది సిబ్బంది ఉండడం అంతే అవసరం. అదే వైద్య రంగ పటిష్టతను సూచిస్తుంది. ఈ సంఖ్యను పెంపొందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం  ఆమోదం తెలిపింది. ఈ దిశగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అన్ని ప్రాంతాల్లో సమతూకంగా ఉండేట్లు వీటి ఏర్పాటు జరుగుతున్నది.  ములుగు, భూపాలపల్లి జిల్లాలు ఒకే నియోజకవర్గంలో ఉన్నా, వీటి సమగ్రాభివృద్ధి జరగాలనీ రెండు ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను మంజూరు చేశాం. కరోనా వంటి పాండమిక్ భయోత్పాతాన్ని మనం చూశాం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైద్యరంగాన్ని పటిష్టం చేస్తున్నాం. 

ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా గొప్ప రక్షణ కవచంగా ఉండాలని వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నది. అన్ని రంగాల్లో తెలంగాణ ఆచరిస్తుంది... దేశం అనుసరిస్తుంది.  వైద్యరంగంలో కూడా తెలంగాణను దేశం అనుకరించే విధంగా యువ రాష్ట్రమైన తెలంగాణ ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, శాసనసభ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ఎస్.మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తాతా మధూధన్ రావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్ రెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, వైద్యశాఖ అధికారులు గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: తెలంగాణలో జనసేన ఉంటుంది, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది! విమర్శకులకు పవన్‌ స్ట్రాంగ్ కౌంటర్!
తెలంగాణలో జనసేన ఉంటుంది, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది! విమర్శకులకు పవన్‌ స్ట్రాంగ్ కౌంటర్!
Pawan Kalyan Press Meet:
"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్
Pawan Kalyan Press Meet: పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Embed widget