అన్వేషించండి

Revanth Reddy Delhi Tour: బుధవారం ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి! మంత్రివర్గ విస్తరణతోపాటు కేంద్రంతో తేల్చుకోవాల్సిన అంశాలపై చర్చ!

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ -2 విస్తరణ కేంద్రంతో చర్చిస్తారు. కేబినెట్ విస్తరణపై కూడా అధిష్ఠానంతో మాట్లాడుతారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మెట్రో ఫేజ్-2పై చర్చలు.
  • కేరళ విజయంతో రేవంత్ రెడ్డికి అధిష్ఠానంలో ప్రాధాన్యత పెరిగింది.
  • రెండు ఖాళీలను భర్తీ చేస్తూ మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు.
  • టీపీసీసీ టీమ్, వర్కింగ్ ప్రెసిడెంట్లను త్వరలో ప్రకటించే అవకాశం.

Revanth Reddy Delhi Tour: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు మొదలయ్యాయి. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారనే ప్రచారంతో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా హై అలర్ట్ అయ్యారు. నౌ అర్ నెవర్ అన్నట్టు కీలక పదవులు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి పర్యటన మాత్రం మంత్రివర్గ విస్తరణతోపాటు కేంద్రం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించనున్నారు. పనిలో పనిగా పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టబోతున్నారని టాక్ నడుస్తోంది. 

మెట్రో ఫేజ్‌-2 విస్తరణపై కేంద్రంతో చర్చలు 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన అజెండా హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2కు సంబంధించిన అనుమతులు, నిధుల సమీకరణ. నగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌ సాధించడం రేవంత్ రెడ్డి లక్ష్యం. ఇందు కోసం ఆయన పలువురు కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అవసరమైన సహకారం కోరనున్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న నిధులు, కొత్త ప్రాజెక్టుల మంజూరుపై ఈ భేటీలు కీలక పాత్ర పోషించనున్నాయి. 

Also Read: జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా? -కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు - బీజేపీ ఊరుకుంటుందా?

కేరళ విజయంతో పెరిగిన ప్రాధాన్యత 

ఈ ఢిల్లీ పర్యటనకు మరో ముఖ్యమైన రాజకీయ కారణం కూడా ఉంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతోంది. ఈ విజయంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో ప్రచారం నిర్వహించిన రేవంత్ , అక్కడ పార్టీ విజయానికి తనదైన శైలిలో సహకరించారని అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ముఖ్యమంత్రి రేసులో ఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి వేణుగోపాల్‌కు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా, ఈ విజయం రేవంత్ రెడ్డికి అధిష్ఠానం వద్ద మరింత పట్టును తెచ్చిపెట్టింది. 

Also Read: తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు

కేబినెట్ విస్తరణ ఆశావహుల ఉత్కంఠ 

రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం రెండు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొందరు మంత్రుల శాఖలను మార్చడం లేదా పని తీరు సరిగా లేని వారిని తొలగించే అవకాశం ఉందనే చర్చ గట్టిగానే సాగుతోంది. మే నెలలోనే ఈ మార్పులు ఉండవచ్చని సమాచారం. 

Also Read: చంద్రబోస్ సోదరుడి మృతిపై అనుమానాలు - శరీరంపై గాయాలు... జీరో ఎఫ్ఐఆర్ నమోదు

మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి లాంటి వారు తమకు గతంలో అధిష్టానం హామీ ఇచ్చిందని, ఈసారి మంత్రిపదవి ఖాయమంటున్నారు. ఎమ్మెల్సీ విజయశాంతి పేరు కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్టీ కోటాలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ లేదా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతలు కూడా మంత్రి పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ప్రక్షాళన ఉంటుందని మరో వాదన కూడా ఉంది. అయితే ఖాళీగా ఉన్న రెండు స్థానాలను వెంటనే భర్తీ చేయాలని సీఎం పట్టుబడుతున్నారు. 

పార్టీ ప్రక్షాళనకు ప్రయత్నాలు 

కేవలం కేబినెట్ మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీమ్‌ను కూడా మే నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక న్యాయం పాటించేలా మాదిగ, లంబాడ, మైనారిటీ వర్గాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని అధిష్ఠానం యోచిస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్‌గా కొనసాగుతుండగా ఇతర కమిటీల్లో కొత్త ముఖాలకు చోటు కల్పించనున్నారు. 

Also Read: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు

Frequently Asked Questions

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరగనుంది?

రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం రెండు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొందరు మంత్రుల శాఖలను మార్చే లేదా తొలగించే అవకాశం ఉంది. మే నెలలోనే ఈ మార్పులు ఉండవచ్చని సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధాన అజెండా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించిన అనుమతులు, నిధుల సమీకరణ. అలాగే, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అవసరమైన సహకారం కేంద్రం నుంచి కోరనున్నారు.

కేరళ ఎన్నికల విజయం రేవంత్ రెడ్డికి ఎలా ఉపయోగపడింది?

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ విజయం అధిష్ఠానం వద్ద ఆయనకు మరింత పట్టును తెచ్చిపెట్టింది.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎప్పుడు ప్రకటించబడుతుంది?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీమ్‌ను మే నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక న్యాయం పాటించేలా వివిధ వర్గాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని యోచిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget