అన్వేషించండి

Telangana Rains Update: తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు

Telangana Heatwave | ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రెండు, మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు దిగిరానున్నాయి.

Telangana Weather Update | హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. అయితే, క్యూములోనింబస్‌ మేఘాల ప్రభావంతో ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. రానున్న 2, 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఉపశమనం కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని, తిరిగి ఈ నెల 8వ తేదీ నుంచి ఎండ తీవ్రత మళ్లీ క్రమంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఉత్తర, తూర్పు మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత మధ్య కురిసే ఈ అకాల వర్షాలు కొంతవరకు చల్లదనాన్ని ఇస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

హైదరాబాద్‌లో రాత్రికి వర్షం.. (Hyderabad Rains)
విపరీతమైన ఎండల తీవ్రత కారణంగా వాతావరణంలో అస్థిరత ఏర్పడి, ఉరుములతో కూడిన మేఘాలు బలంగా తయారయ్యాయి. వీటి ప్రభావంతో అదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. హైదరాబాద్‌లో ఈ రాత్రి అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో నగరంలో వర్షం పడేందుకు వాతావరణం మరింత అనుకూలిస్తుంది. మే 6 లేదా 7 తేదీల్లో నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

వచ్చే 2 గంటల్లో అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, జగిత్యాల, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి. సాయంత్రం సమయానికి సిద్దిపేట, జనగామ, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల్లో కూడా కొన్ని తుపాను మేఘాలు ఏర్పడతాయి. ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లోనేడు వర్షాలు కురుస్తున్నాయి. 

అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget