By: ABP Desam | Updated at : 28 Nov 2022 11:14 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పాదయాత్ర చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణకు రానుంది.
ఐదో విడత పాదయాత్రకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు... నిన్న సాయంత్రం బండి సంజయ్‌ను అడ్డుకున్నారు. బైంసా నుంచి ఐదో విడత పాదయాత్రకు చేపట్టేందుకు ఆయన యత్నించారు. బైంసాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు పాదయాత్ర అనుమతి నిరాకరించారు. భైంసా వెళ్తున్న ఆయన్ని అడ్డుకొని తిరిగి కరీంనగర్ పంపేశారు.
పోలీసులు అభ్యంతరం చెప్పి పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. హౌస్ మోషన్ కుదరక పోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫస్ట్ కాల్ లిస్ట్‌లో పిటిషన్ మెన్షన్ చేశారు. ఇది మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు రానుంది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు ఐదో విడదత పాదయాత్రపై నిన్న రాత్రి నుంచి హైడ్రామా నడుస్తోంది. ఇదివరకే నాలుగు విడతల పాదయాత్ర ముగియగా, ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ్టి(నవంబర్ 28) నుంచి ప్రారంభించాలని బండి సంజయ్ అనుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బండి సంజయ్ పాదయాత్రకు ఇటీవల పోలీసుల అనుమతి కోరారు. కానీ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ సురేశ్ స్పష్టం చేశారు. ఐదో విడత పాదయాత్రను బండి సంజయ్ బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభించి, కరీంనగర్‌లో భారీ సభతో ముగించాలని తొలుత భావించారు.
ఐదో విడత పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించినా బండి సంజయ్ నిర్మల్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల దాటాక ఆయన్ని అడ్డుకున్నారు. బండి సంజయ్ వెనక్కి తిరిగి వెళ్లకపోవడంతో జగిత్యాల మండలంలోని తాటిపల్లి వద్ద పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకుని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు, బీజేపీ శ్రేణుల సహాయంతో బండి సంజయ్ పోలీసుల నుంచి తప్పించుకుని కార్యకర్తల వాహనంలో కోరుట్ల వైపు వెళ్లారు. అక్కడ పోలీసులు ఆయనతో మాట్లాడి తిరిగి ఇంటికి పంపించేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో ఆయన తిరిగి కరీంనగర్ వచ్చేశారు. అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు.
BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబు అంటున్న మంత్రి కేటీఆర్
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
నేను చేసింది నమ్మకద్రోహం అయితే నువ్వు చేసిందేంటీ? అనిల్‌ను ప్రశ్నించిన కోటంరెడ్డి
Union Budget 2023-24: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా- హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు!
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక