By: M Seshu | Updated at : 12 Jan 2023 11:00 PM (IST)
కాసాని జ్ఞానేశ్వర్ (Photo Source: Facebook)
తెలంగాణలో టిడిపి బలపడుతోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ABP దేశం ప్రత్యేక ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ మనసులో విషయాలు బయటపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కేవలం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వల్ల మాత్రమే సాధ్యం కాలేదని, సకల జనుల సమ్మె, బంద్, నిరసనలు, ప్రజా ఉద్యమాలతోనే తెలంగాణ సాధించుకుంటే.. ఇప్పుడు ఆ ఖ్యాతి కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సొంతం అన్నట్లు వ్యవహరిస్తున్నారని జ్ఞానేశ్వర్ అన్నారు.
ఖమ్మం సభతో మా సత్తా చూపించామని, త్వరలో నిజామాబాద్ లో సైతం టిడిపి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ నడి బొడ్డున ఎవరూ ఊహించని స్థాయిలో లక్షలాది మందితో సభ నిర్వహించి మరోసారి తెలంగాణలో టిడిపి బలహీనపడిందన్న వాళ్ల నోళ్లను మూయిస్తామంటున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన తనకు ఇప్పుడు తెలంగాణలో టిడిపికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం పెద్ద విషయం కాదన్నారు. ఏనిమిదేళ్ల తరువాత ఇక్కడ హడావుడి చేస్తున్నామని కొందరు మాట్లడుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో గెలిచిన 15 మంది ప్రజాప్రతినిధులను టిఆర్ఎస్ తనవైపు లాక్కుందని ఆరోపించారు. పొలిటికల్ గేమ్ లో భాగంగా టిడిపిని దెబ్బకొట్టాలని బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉందని విమర్శించారు. పార్టీ నుంచి నాయకులు మాత్రమే వారి లబ్ధికోసం ఇతర పార్టీల మాయలో పడ్డారని, తెలంగాణలో టిడిపి కార్యకర్తలు, జనం ఇంకా టిడిపి వెంట ఉన్నారని జ్ఞానేశ్వర్ ధీమా వ్యక్తం చేసారు.
రైతు కుంటుంబంలో పుట్టిన తాను వార్డు నెంబర్ నుండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడి స్దాయికి ఎదిగానేంటే అది తన కష్టం, ప్రజాధరణతోనే సాధ్యమైందన్నారు. మా కుటుంబానికి అప్పట్లో 24 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ పంటలు పండే అవకాశం లేక తాను ఆటో నడిపి కుటుంబాన్ని పోషించాల్సి వచ్చిందని తెలిపారు. ఒక్కోరోజు ఆటో నడిపి తెచ్చిన డబ్బు ఇంట్లో ఇస్తే తప్ప ఆరోజు తిండి ఉండేది కాదన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసానని, ఆ సందర్భంలో భూములు, వాటి లెక్కలు ఇలా వివరంగా తెలుసుకుని, కష్టపడి సంపాదించానని, ఇప్పడు అలా సంపాదించి కొన్న భూములు కోట్లాది రూపాయలు ధరలు పలుకుతున్నాయే తప్ప తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదన్నారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.
తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో టిడిపి స్దబ్దుగా ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాలపై ప్రత్యక దృష్టి పెట్టాం. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టిడిపి అభ్యర్దులు ఎన్నికల బరిలో దిగడంతోపాటు విజయం సాధించడం ఖాయమన్నారు. తెలంగాణాలో టిడిపి అవసరమా అనే వాళ్లకు నా ధీటైన సమాధానం ఒక్కటే , అదే ఇప్పటివరకూ తెలంగాణలో జరిగిన అభివృద్ది కేవలం కట్టు కథలు మాత్రమే. లక్షల కోట్లు అప్పులు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసిఆర్ సర్కారు ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో నిర్వీర్యం అయ్యింది. అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా టిడిపి ఎదుగుతోందన్నారు. సీట్లు గెలవడం మాత్రమే కాదు తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అన్ని కులాలకు ప్రాధాన్యత నిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేసారు.
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!
Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?