News
News
వీడియోలు ఆటలు
X

NTR Centenary: ఎన్టీఆర్‌ శతజయంతికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం, ఇతర కుటుంబ సభ్యులకు కూడా

మే 20న శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లోని కైతలాపూర్‌లో నిర్వహించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్ రామ్, పురంధేశ్వరిని కూడా ఆహ్వానించారు.

FOLLOW US: 
Share:

NTR Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం అందింది. జూనియర్ ఎన్టీఆర్ సహా ఇతర కుటుంబ సభ్యులను కూడా టీడీపీ నేతలు ఆహ్వానించారు. మే 20న శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లోని కైతలాపూర్‌లో నిర్వహించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్ రామ్, పురంధేశ్వరిని కూడా ఆహ్వానించారు. ఇటీవల నిర్వహించిన శత జయంతి వేడుకలకు బాలక్రిష్ణ తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం అందింది. జూనియర్ ఎన్టీఆర్ సహా ఇతర కుటుంబ సభ్యులను కూడా టీడీపీ నేతలు ఆహ్వానించారు. మే 20న శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లోని కైతలాపూర్‌లో నిర్వహించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్ రామ్, పురంధేశ్వరిని కూడా ఆహ్వానించారు. ఇటీవల నిర్వహించిన శత జయంతి వేడుకలకు బాలక్రిష్ణ తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని కైతలాపూర్ మైదానంలో జయహో ఎన్టీఆర్ వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ వెబ్‌సైట్ నిర్వహణపై నిన్న చంద్రబాబుతో కమిటీ సమావేశమై, వెబ్‌సైట్‌ ఆవిష్కరణకు ఎవరెవరిని ఆహ్వానించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ స్వయంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కలిసి ఆహ్వానం అందించారు. 

జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు, నందమూరి జయకృష్ణ, నందమూరి మోహన కృష్ణ, గారపాటి లోకేశ్వరి, కంటమనేని ఉమా శ్రీనివాస్ ప్రసాద్, నందమూరి కళ్యాణ్‌ చక్రవర్తి, కాట్రగడ్డ రుక్మాంగదరరావులకు ఆహ్వాన పత్రాలు అందించారు. నందమూరి రామకృష్ణతో కలిసి వెళ్లి టీడీ జనార్దన్ నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానాలను అందించారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విదేశాల్లోని తెలుగువారు కూడా ఆ యుగపురుషుణ్ని ఘనంగా స్మరించుంటున్నారు. ఖండాంతరాల్లో స్థిరపడిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడిక క్కడ ఎన్టీఆర్ విగ్రహలు పెట్టి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సావనీర్ కమిటీ ‌ఛైర్మన్‌గా టీడీ జనార్ధన్ ఉన్నారు. గత నెల 28వ తేదీన విజయవాడలో జరిగిన సభకు చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ ఒకే వేదికపై కనిపించారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వంద సభలు నిర్వహించి, మే 28 శత జయంతిని గొప్పగా నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, దేశ వ్యాప్తంగా 10 చోట్ల, అంతర్జాతీయ స్థాయిలో 47 చోట్ల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని గతంలో మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు.

Published at : 15 May 2023 03:22 PM (IST) Tags: Jr NTR Kalyan Ram Purandeshwari ABP Desam TDP news breaking news NTR centenary celebration

సంబంధిత కథనాలు

Bandi Sanjay on TDP:

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

టాప్ స్టోరీస్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!