News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్ - రూ. 100 టికెట్ తీసుకుంటే పల్లె వెలుగులో రానుపోనూ ఫ్రీ

టి-9 టికెట్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు. ఈ టికెట్ ఈ నెల 18(ఆదివారం) నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. 

FOLLOW US: 
Share:

గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి-9 టికెట్ అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోన్న సంస్థ.. తొలిసారిగా గ్రామీణ, ప‌ట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టి-9 టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో శుక్రవారం టి-9 టికెట్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు. ఈ టికెట్ ఈ నెల 18(ఆదివారం) నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. 
టి-9 టికెట్ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఈ టికెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. టి-9 టికెట్ కు రూ.100 ధరగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టోల్ గేట్ చార్జీల‌పైన మిన‌హాయింపు ఇచ్చింది. దీంతో ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.20 నుంచి రూ.40 వ‌ర‌కు ఆదా అవుతంద‌ని సంస్థ ప్రకటించింది. 

60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు వయసు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి టి-9 టికెట్ పొందవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టికెట్లను కండక్టర్లు ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. 

"పల్లె వెలుగు బ‌స్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో టి-9 టికెట్‌కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఈ టికెట్ తో రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించవచ్చు. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి తెచ్చామని, వాటికి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని గుర్తు చేశారు. ఆ టికెట్లకు మంచి స్పందన వ‌స్తుండ‌టంతో తొలిసారిగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల కోసం ‘టి-9 టికెట్’ను తీసుకువచ్చామని చెప్పారు. ఈ టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. 

‘టి-9 టికెట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లు, పీవీ ముని శేఖర్, పురుషోత్తం, కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్ర‌సాద్‌, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్‌, సీఎఫ్ఎం విజ‌య‌పుష్ఫ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read:హైదరాబాద్‌ ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ - టీ-24 టికెట్ ధరలు పెంపు

Also Read:  హైదరాబాదీలకు టీఎస్ఆర్టీసీ శుభవార్త! ఈ రూట్స్‌లో ఇక బస్సులు మారనక్కర్లేదు

Published at : 16 Jun 2023 01:01 PM (IST) Tags: TSRTC Sajjanar T-24 T-9 Pallevelugu

ఇవి కూడా చూడండి

TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు

TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

DK Aruna: ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, నాలుక మడతపెట్టి కుట్టేస్తా : డీకే అరుణ వార్నింగ్

DK Aruna: ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, నాలుక మడతపెట్టి కుట్టేస్తా : డీకే అరుణ వార్నింగ్

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

టాప్ స్టోరీస్

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ