అన్వేషించండి

Rajeev Kanakala School Controversy : రాజీవ్ కనకాలను అందుకే నిలదీశాం - స్కూల్ కాంట్రవర్సీపై NTVS రియాక్షన్... అసలేం జరిగింది?

Suma Kanakala Husband Reaction : ప్రైవేట్ స్కూల్ ఇష్యూలో రాజీవ్ కనకాల సారీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో అసలు నిజాలను NTVS అధ్యక్షుడు బయటపెట్టారు.

Suma Kanakala Husband Rajeev Kanakala Reaction About School Controversy : ప్రముఖ యాంకర్ సుమ భర్త, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల స్కూల్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓ ప్రైవేట్ స్కూల్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాగా... పర్మిషన్ లేని స్కూల్‌ను ప్రమోట్ చేస్తున్నారంటూ... ఆయనపై నవ తెలంగాణ విద్యార్థి శక్తి (NTVS) ఆగ్రహం వ్యక్తం చేసింది. 

హైదరాబాద్‌లోని వైబ్రాంట్ అనే స్కూల్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన రాజీవ్... అక్కడ విద్యార్థులకు గిఫ్ట్స్ ఇస్తుండగా NTVS సభ్యులు అడ్డుకున్నారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని... ఎలా ప్రమోట్ చేస్తారంటూ ఆయన్ను నిలదీశారు. ఈ క్రమంలో స్కూల్ యాజమాన్యానికి, విద్యార్థి సంఘ నాయకులకు గట్టిగానే వాగ్వాదం జరిగింది. 

సారీ చెప్పిన రాజీవ్

ఈ వివాదంపై రాజీవ్ కనకాల సారీ చెప్పారు. అసలు తనకు ఆ స్కూల్‌తో ఎలాంటి సంబంధం లేదని... కేవలం చీఫ్ గెస్ట్‌గా పిలిచారనే వెెళ్లినట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. 'ఆ స్కూల్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన నేను విద్యార్థులను అభినందించా. నా చేతుల మీదుగా వారికి షీల్డ్స్ అందించా. నిజంగా ఈ స్కూల్‌కు పర్మిషన్ ఉందా లేదా అనేది నాకు తెలీదు. పిల్లలను ఎంకరేజ్ చేస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే చీఫ్ గెస్ట్‌గా వెళ్లా.

అంతే తప్ప స్కూల్‌ను ప్రమోట్ చేసే ఉద్దేశం నాకు లేదు. నా వీడియోస్, ఫోటోస్ వాడొద్దని స్కూల్ యాజమాన్యానికి చెప్పా. పేరెంట్స్ కూడా ముందుగా అన్నీ ఎంక్వైరీ చేసుకోవాలి.' అంటూ వీడియో రిలీజ్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raajeev Kanakala (@raajeevkanakala)

Also Read : డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా రామ్ ఎంట్రీ - సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఎనర్జిటిక్ హీరో కొత్త మూవీ

NTVS రియాక్షన్...

రాజీవ్ కనకాల ఇంత పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారని తాను అనుకోలేదని చెప్పారు NTVS అధ్యక్షుడు పవన్. 'వైబ్రాంట్ స్కూల్‌కు మేనేజ్మెంట్ వేరే ఉండేది. దీని వల్ల తమకు నష్టం జరుగుతుందని కొందరు పేరెంట్స్ మమ్మల్ని సంప్రదించారు. అక్కడికి వెళ్లాక కొత్త స్కూల్ ఓపెన్ అవుతుందన్నారు. అసలు ఈ స్కూల్‌కు పర్మిషన్  లేదు. రాజీవ్ గారు పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేయాలని... బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలని అన్నారు. అందుకే మేము ఆయన్ను ప్రశ్నించాం.

ఆయన లాంటి ప్రముఖ వ్యక్తి ఈ స్కూల్ గురించి చెప్తే పేరెంట్స్‌కు తప్పుడు సమాచారం వెళ్తుంది. దీని వల్ల విద్యార్థులు నష్టపోతారు. అందుకే ఆయన్ను అడ్డుకున్నాం. సన్మానాలు జరిగిన స్టూడెంట్స్ అసలు ఆ స్కూల్ నుంచి హాల్ టికెట్ తీసుకోలేదు. వారంతా వేర్వేరు స్కూల్స్ నుంచి వచ్చిన వారు. అందుకే రాజీవ్ గారికి తెలిసే వచ్చారా? లేదా? అని ప్రశ్నించాం. రాజీవ్ గారు స్పందించిన తీరు ప్రశంసనీయం. ఆయనకు పర్సనల్‌గా థాంక్స్ చెబుతాం.' అని అన్నారు.

Also Read : శుక్రవారం ఓటీటీలో కొత్త మూవీస్ సందడి - ధురంధర్ 2 నుంచి కర్తవ్య... ఒకే రోజు 16 సినిమాలు

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget