Special Trains: హైదరాబాద్ నుంచి ఊరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్- మీ టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్
Special Trains : ఎన్నికలు, సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లకు అదనపు బోగీలు అమర్చింది. దీని లిస్ట్ కూడా ప్రకటించింది.
![Special Trains: హైదరాబాద్ నుంచి ఊరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్- మీ టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ Special Trains between Secunderabad and Visakhapatnam South Central Railway Temporary augmentation of trains to clear the extra rush of waiting list passengers in the following trains Special Trains: హైదరాబాద్ నుంచి ఊరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్- మీ టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/11/8e03f2d381d37c132e8e86a8091a6cbc1715413872890215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
South Central Railway: ఆంధ్రప్రదేశ్‌లో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికలు ఓవైపు, వేసవి సెలవులు మరోవైపు రెండూ కలిసి రావడంతో తెలంగాణ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ట్రైన్స్‌లో రద్దీ మామూలుగా లేదు మూడు నెలల క్రితం నుంచి రెగ్యులర్ రైళ్లు నిండిపోగా... ఇప్పుడు కొత్తగా వేసిన స్పెషల్ ట్రైన్స్‌లో కూడా ఖాళీ లేదు.
ఇప్పుడు రద్దీని దృష్టిలో పెట్టుకున్న దక్షిణ మధ్య రైల్వే వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉండటంతో అదనుపు బోగీలు ఏర్పాటు చేస్తోంది. కొన్ని ట్రైన్స్‌కు అదనపు బోగీలు అమరుస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది.
సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు కూడా వేసింది. ఆ వివారాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఈ స్పెషల్ ట్రైన్ బయల్దేరనుంది. 07097 నెంబర్ గల సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాయంత్ర ఏడు గంటల 45 నిమిషాలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనుంది. విశాఖ సోమవారం ఉదయం ఆరున్నరకు చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం 7.45కి విశాఖలో రిటర్న్ కానుందా ట్రైన్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)