By: ABP Desam | Updated at : 08 May 2023 05:14 PM (IST)
ప్రత్యేక విమానంలో చేరిన విద్యార్థులు
మణిపూర్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన తెలంగాణకు చెందిన విద్యార్థుల్లో కొంత మంది హైదరాబాద్ కు చేరుకున్నారు. మొత్తం 75 మంది విద్యార్థులతో ఓ ప్రత్యేక విమానం శంషాబాద్ విమానాశ్రయానికి నేడు (మే 8) చేరుకుంది. ఇంకా కొంత మంది విద్యార్థులను కోల్‌కతా మీదుగా ఈ రోజు (ఏప్రిల్ 8) సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత విద్యార్థులను వారి వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మణిపూర్‌లోని ఇంఫాల్ యూనివర్సిటీతో పాటు వేర్వేరు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న 103 మంది తెలంగాణ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా సొంత ప్రాంతానికి రప్పించడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలను పంపాయి.
వీటిలో ఓ విమానం 75 మంది విద్యార్థులతో ఓ విమానం సోమవారం (మే8) మధ్యాహ్నం 12.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడటానికి ఇప్పటికే తెలంగాణ భవన్‌కు చెందిన ఇద్దరు అధికారులను కోల్‌కతా పంపించారు. కోల్‌కతా నుంచి వచ్చే వారి కోసం టిక్కెట్లు బుక్ చేసినట్టు చెప్పారు.
మణిపూర్ అల్లర్లలో 50 మందికి పైగా చనిపోయారు. దాంతో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయినా అల్లర్లు అదుపులోకి రాకపోవటంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana Formation Day: తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేస్తే, సోనియా వారి బాధను అర్థం చేసుకున్నారు: మీరా కుమార్
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం
Telangana Formation Day: రాదన్న తెలంగాణను సాధించిన ఘనుడు, పాలకుడిగా నిలిచిన కేసీఆర్- ట్విట్టర్‌లో ప్రశంసలు
YS Sharmila: ప్రతిపక్షాలు అమ్ముడుపోతేనే వైఎస్‌ఆర్‌టీపీ పుట్టింది, ప్రజల కోసం పోరాటం చేస్తోంది: వైఎస్ షర్మిల
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్
Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!