టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌పై హైకోర్టుకు సిట్ నివేదిక
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో లోతైనా దర్యాప్తు జరుగుతోందని తెలంగాణ హైకోర్టుకు సిట్ నివేదిక సమర్పించింది.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌పై హైకోర్టుకు సిట్ నివేదికను అందజేసింది. పేపర్ లీక్, నిందితుల అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలపై అన్నింటిని కోర్టుకు వివరించింది. టీఎస్‌పీఎస్ పేపర్‌ను రాజశేఖర్, ప్రవీణ్ లీక్ చేశారని నివేదికలో సిట్ పేర్కొంది.
టీఎస్పీఎస్సీ బోర్డు ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేసులో మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. దీనిపై లోతైన దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు టీం.. తన నివేదికని హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల పాత్రపై ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు.
కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్‌పై జరిపిన విచారణలో కోర్టుకు నివేదికను సిట్ అందజేసింది. ఈ కేసు విచారణ లోతుగా పారదర్శకంగా జరుగుతోంది... 18 మంది నిందితుల్లో 17 మందిని ఇప్పటి వరకు అందజేశామని కోర్టుకు అడ్వకేట్ జనరల్ వివరించారు. న్యూజిలాండ్‌లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ అరెస్టు కోసం ట్రై చేస్తున్నట్టు పేర్కొన్నారు.
సిట్‌పై నమ్మకం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విచారణ కింది స్థాయి సిబ్బందికే పరిమితం అవుతుందని... పెద్దల వరకు వెళ్లలేకపోతున్నారని వివరించారు. కమిషన్, సిట్ అధికారులు చెప్పక ముందే ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో మంత్రికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఎన్‌ఆర్‌ఐల పాత్ర కూడా ఉందని చెబుతున్నందున సిట్ దర్యాప్తు సరిపోదని... సీబీఐకి అప్పగించాలని కోరారు.
రెండు వర్గాల వాదనలు విన్న కోర్టు... పరీక్షల నిర్వహణ బాధ్యత ఎవరికి అప్పగించారో చెప్పాలని కేసు దర్యాప్తును 24కి వాయిదా వేసింది.