అన్వేషించండి

చ‌నిపోయిన‌ ప్రతీ స‌ర్పంచ్ కుటుంబానికి రూ.కోటి ప‌రిహారం ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ సర్పంచుల వ్యవస్థను సర్వం నిర్వీర్యం చేశారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో 60మంది స‌ర్పంచులు చ‌నిపోయార‌ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలిపారు.

బీఆర్ఎస్ ను బొంద పెట్టి, కేసీఆర్ కు అధికారం లేకుండా చేస్తేనే స‌ర్పంచుల‌కు పూర్వ వైభ‌వం వ‌స్తుంద‌న్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ సర్పంచుల వ్యవస్థను సర్వం నిర్వీర్యం చేశారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో 60మంది స‌ర్పంచులు చ‌నిపోయార‌ని ఆయ‌న తెలిపారు. ప్రభుత్వ వైఖ‌రి వ‌ల్ల చ‌నిపోయిన ప్రతీ స‌ర్పంచ్ కుటుంబానికి రూ.కోటి ప‌రిహారం ప్రక‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయ‌తీ రాజ్ సంఘ‌ట‌న్ ఆధ్వర్యంలో ధ‌ర్నాచౌక్ వ‌ద్ద చేప‌ట్టిన ధ‌ర్నాలో రేవంత్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందని చెప్పారు. ప్రభుత్వం వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్న పరిస్థితి ఉంద‌ని తెలిపారు. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందన్నారు. 

హైకోర్టు అనుమతితో సోమవారం కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోందని, ధర్నాకు ఎంతో మంది సర్పంచులు పరోక్షంగా మద్దతు తెలిపార‌ని చెప్పారు రేవంత్. స‌ర్పంచుల‌కు రావాల్సిన నిధుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సర్పంచుల వాటాను వారి ఖాతాలో వేయాల్సి ఉంటుంద‌ని, కానీ వారికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం దోపీడీ చేస్తోందని విమ‌ర్శించారు. సర్పంచుల ఆత్మ గౌరవం దెబ్బతీసి, వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పింది కేసీఆర్ కాదా అని ఆయ‌న ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికే స‌ర్పంచుల‌కు రావాల్సిన నిధుల‌ను దారి మ‌ళ్లించార‌ని ఆరోపించారు. 

స‌ర్పంచుల వ్యవ‌స్థను నిర్వీర్యం చేయ‌డ‌మే కాకుండా చెట్టు చనిపోయినా సర్పంచ్ ను సస్పెండ్ చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. చెట్టు చ‌నిపోయినందుకు స‌ర్పంచ్ ను స‌స్పెండ్ చేస్తే...  నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను ఏం చేయాలని రేవంత్ ప్ర‌శ్నించారు. కేటీఆర్ నిర్లక్ష్య వైఖ‌రితో మూసీలో మునిగి 30 మంది చనిపోయారని ఆయ‌న ఆరోపించారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మామూలు ప‌రిస్థితులు లేవ‌ని, ఇందులో మునిసిపల్ శాఖ మంత్రి నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంద‌న్నారు. రాష్ట్రాన్ని ఇంత అధ్వాన్నంగా మార్చిన తండ్రీ, కొడుకులను ట్యాంక్ బండ్ మీద ఉరేసినా తప్పు లేదని తెలిపారు రేవంత్. తెలంగాణ‌లో పుట్టబోయే బిడ్డమీద కూడా కేసీఆర్ రూ.1లక్షా 50వేల అప్పు వేశాడ‌ని, తెలంగాణ మోడల్ అంటే ఇదేనా అని ఆయ‌న ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ అంటే భ‌స్మాసుర స‌మితి
బీఆరెస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదని భస్మాసుర సమితి అని ఎద్దేవా చేశారు రేవంత్. స‌ర్పంచుల వ్య‌వ‌హారంలో త‌న బుద్ది మార్చుకోకపోతే భస్మాసుర సమితి కూడా కేసీఆర్ ను కాపడలేదని హెచ్చ‌రించారు. 4వేల కొత్త పంచాయ‌తీల‌ను ఏర్పాటు చేశామ‌ని గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్.. వాటిలో ఎక్కడైనా భ‌వ‌నాలు కట్టించారా అని నిలదీశారు. ప్రగ‌తి భ‌వ‌న్, సెక్రటేరియ‌ట్‌ల‌కు వేల కోట్లు ఖ‌ర్చు చేసిన కేసీఆర్ స‌ర్పంచులకు నిదులు విడుద‌ల చేయ‌డంపై దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. సర్పంచుల సమస్యలు తీరాలంటే కేసీఆర్ అధికారం పోవాల‌ని, బీఆరెస్ ను బొంద పెట్టాలన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని పొలిమేరలు దాటేదాక తరమాలని చెప్పారు రేవంత్. పనికిమాలిన చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామ‌ని, సర్పంచుల నిధులు ఎవరూ దొంగిలించకుండా పటిష్ట చట్టం తీసుకొస్తామ‌ని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. పంచాయతీలు చేయాల్సిన పనిని ప్రైవేటు సంస్థల‌కు అప్పగించి కేసీఆర్ ఆర్థిక దోపీడికి పాల్పడ్డార‌న్నారు రేవంత్. కేసీఆర్ దోపిడీని నిలువ‌రించేందుకు స‌ర్పంచులు మంచి నిర్ణ‌యం తీసుకోవాల‌ని, అడుక్కోవ‌డం మాని... కొట్లాడి హ‌క్కులు సాధించుకోవాల‌ని పిలుపునిచ్చారు. 

రేవంత్ కు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల విన‌తి
తమ సమస్యలపై ధర్నా చౌక్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎస్ఐ, కానిస్టేబుల్ సమస్యల పరిష్కార పోరాట సమితి వినతి పత్రం అందించింది. తమ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. పోలీస్ ఉద్యోగ నియామకాలపై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశాన‌ని, న్యాయం జ‌రిగే వ‌ర‌కు కాంగ్రెస్ అండ‌గా ఉంటుంద‌ని రేవంత్ హామీ ఇచ్చారు. ఏ నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నియామకాల కోసమే మళ్లీ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్ధితి రాష్ట్రంలో ఉంద‌న్నారు రేవంత్. రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా తెలంగాణ  అధికారిని కాకుండా ఇత‌రుల‌ను నియ‌మించార‌ని, 
కీలక శాఖలన్నింటిలో తెలంగానేతరులను నియమించారని విమ‌ర్శించారు. తెలంగాణ‌ ప్రాంతంపై ఆ అధికారులకు ప్రేమ, అభిమాననం ఏదీ లేదన్నారు. పరిపాలన అందించడానికి  తెలంగాణ అధికారులకు సమర్ధత లేదా అని రేవంత్ ప్ర‌శ్నించారు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ఆ అధికారులకు పట్టింపు లేదని చెప్పారు. తెలంగాణ అధికారులను, ప్రజలను కేసీఆర్ నమ్మడం లేదని, తెలంగాణ ప్రజల్ని అవమానించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. స‌రైన ప‌ద్ధతిలో నియామకాలు చేపట్టకపోతే ప్రజ‌లు కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టడం ఖాయమ‌ని హెచ్చరించారు. 

డీజీపీని క‌లిసిన టీపీసీసీ నేత‌ల బృందం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇత‌ర నేత‌ల‌తో క‌లిసి సోమ‌వారం సాయంత్రం డీజీపీని క‌లిశారు. 12మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు , నాగర్ కర్నూలులో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆరెస్ నేతల దాడుల అంశాలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. నాగ‌ర్  కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నేత‌లు దూషనలు, దాడులకు దిగారని రేవంత్ తెలిపారు. గొంతుపై కాలు పెట్టి తొక్కి పరుష పదజాలంతో దూషించారని, దాడికి గురైన బాధితుల్లో ఒకరు గిరిజనుడు, మరొకరు దళితుడు ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని భావించామ‌ని, కానీ త‌మ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిపైనే అక్రమ కేసులు పెట్టారని రేవంత్ మండిప‌డ్డారు. ఇది ప్రభుత్వం, పోలీసుల బరితెగింపు చర్య అన్నారు రేవంత్. నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యక‌ర్తల‌పై దాడులకు నిరసనగా ఈ నెల 17న దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామ‌ని చెప్పారు.

నాగ‌ర్ క‌ర్నూల్ దాడి ఘ‌ట‌న‌తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్యలు కోరుతూ మ‌రో ఫిర్యాదును కూడా అందించామ‌న్నారు. 12 మంది పిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరిన‌ట్లు రేవంత్ తెలిపారు. ఈ అంశంపై చీఫ్ సెక్రటరీని అపాయింట్ మెంట్ కోరితే తప్పించుకు తిరుగుతున్నారని, సీఎస్ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలా  చేస్తే సీఎస్ ఉద్దేశపూర్వకంగానే అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు వత్తాసు పలుకుతున్నట్లు కాంగ్రెస్ భావించాల్సి వస్తుందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల 12 నియోజకవర్గాల్లో సంక్రాంతి తరువాత కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Hemant Soren: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bachhala Malli Teaser: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
Embed widget