Revanth Reddy: టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల కుమ్ములాట.. స్టేషన్‌కు రేవంత్, వాళ్ల సంగతి అప్పుడు చూస్తానని హెచ్చరిక
తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు బుధవారం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేయడంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్టు చెప్పిందని, అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు బుధవారం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టలేదని, కాంగ్రెస్ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెడుతున్నారని పోలీసులను ప్రశ్నించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో భయపెడుతున్నారని అన్నారు.
తమ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. టీఆర్ఎస్‌కు వత్తాసు పలికే అధికారులను గుర్తు పెట్టుకుంటామని, తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పబోవని హెచ్చరించారు. ‘‘కేటీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ కార్యకర్తలు బజారు రౌడీల్లా నిన్న నా ఇంటిపై దాడి తెగబడిన సందర్భంలో అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, అర్ధరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ రౌడీలు చేసిన దాడిపై మాత్రం కనీసం కేసు నమోదు చేయలేదు. ఇది పక్షపాతమా? పోలీసు శాఖకు సోకిన ‘గులాబీ’ పక్షవాతమా!?’’ అని రేవంత్ రెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
Also Read: YS Sharmila: వైఎస్ షర్మిలకు అడ్డా కూలీలు షాక్.. నడి రోడ్డుపై పరువు తీసేసి.. ఆగ్రహావేశాలు
దాడిని ఖండించిన నారాయణ
రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. అసలు బందిపోట్లు టీఆర్ఎస్ లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇళ్ల మీద దాడులు చేయడం నీచ సంస్కృతికి నిదర్శనమని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి ఇంటి మీద దాడిని అఖిల పక్షం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ఇంకోసారి దాడులకు తెగబడితే మీ సంగతి చూస్తామని తీవ్ర హెచ్చరిక చేశారు. ‘‘దమ్ముంటే డైరెక్ట్‌గా రావాలి.. చూసుకుందాం’’ అని సవాలు విసిరారు.
Also Read: Mahabubabad: భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన భార్య, ఆ వెంటనే ఇంకో ఘాతుకం.. కారణం ఏంటంటే..
ఇందిరా పార్కు వద్ద అఖిల పక్ష నేతల ధర్నా
మరోవైపు, ఇందిరాపార్కు వద్ద అఖిలపక్ష నేతల ధర్నా కొనసాగుతోంది. రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ధర్నాలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ ధర్నాలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రామ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరును పలువురు తప్పుబట్టారు. ‘‘ఇది చారిత్రాత్మక దినం. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఒకే వేదిక మీదకు వచ్చాయి. భారత రాజకీయాలకు ఇది ఒక మలుపు. కేంద్రంలో మోడీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. మోదీ నియోజక వర్గం వారణాసిలో వందలాది కరోనా శవాలు కొట్టుకు వచ్చాయి. ఇది మోదీ సర్కార్ వైఫల్యాలకు నిదర్శనం’’ అని మధుయాస్కి ఆరోపించారు.
తెరపైకి నల్ల చట్టాలు
‘‘కేసీఆర్ ఒక్కడే ప్రగతి భవన్ లో ఉంటే ప్రతిపక్షాలు అన్ని ఇందిరా పార్క్ వద్ద ఉన్నాయి. తెలంగాణలో ఆరోగ్య సంక్షోభం నెలకొంది. కోవిడ్ కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నా భిన్నం అయ్యాయి. డిమాండ్ల సాధన మొదలు పెడితే కేసీఆర్ నల్ల చట్టాలు తెర మీదకు తెస్తున్నారు. సంపన్నులకు లాభం చేకూరేలా ధరణి చట్టం’’ అని కోదండ రామ్ మాట్లాడారు.
Also Read: Tumkur Condom Case: హైవేపై కండోమ్ కేసులో కళ్లుచెదిరే ట్విస్ట్.. సొరంగంలో శృంగార భోగాలు!