News
News
X

Rangareddy: తాగిన మత్తులో పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవ, పిడిగుద్దులతో కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు

Rangareddy News: నార్సింగిలో పెట్రోల్ బంక్ లో పని చేసే సంజయ్ ను చంపిన హంతకులను పట్టుకోవాలని గ్రామస్థులు ధర్నా చేశారు. పోలీసులు కలుగజేసుకుని నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు.

FOLLOW US: 
Share:

Rangareddy News: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. గొడవ పడుతుంటే అడ్డుకోబోయిన వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ దుర్ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకుని అరెస్టు చేయాలని, తగిన శిక్ష విధించాలని ధర్నా చేస్తున్నారు. 

బంక్ సిబ్బందిపై దాడి, హత్య

రంగారెడ్డి జిల్లా నార్సింగి జన్వాడలోని పెట్రోల్ బంక్ కు ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిపోవడం, ముగ్గురు యువకులు మద్యం మత్తులో తూలుతుండటంతో పెట్రోల్ బంక్ సిబ్బంది, పెట్రోల్ లేదని చెప్పారు. అయితే తాము చాలా దూరం వెళ్లాలని కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్ సిబ్బందిని బతిమాలాడారు. దీంతో బంక్ సిబ్బంది పెట్రోల్ పోశారు. ఆ తర్వాత డబ్బులు ఇచ్చే సమయానికి కార్డు పని చేయడం లేదంటూ ఆ ముగ్గురు వ్యక్తులు బుకాయించేందుకు ప్రయత్నించారు. కార్డు పని చేయకపోతే క్యాష్ ఇవ్వాలని బంక్ సిబ్బంది అడిగారు. 

మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ పిడిగుద్దులు

మమ్మల్నే అడుగుతావా.. మాకే ఎదురుతిరుగుతావా అంటూ ఆ ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్ క్యాషియర్ పై దాడికి దిగారు. తన తోటి సిబ్బందిని కొడుతుండటాన్ని చూసిన సంజయ్.. వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. క్యాషియర్ ను కొట్టవద్దని చెబుతూ వారిని అడ్డుకోబోయాడు. మాకే అడ్డు వస్తావా అంటూ ఆ ముగ్గురు కలిసి సంజయ్ ను విపరీతంగా కొట్టారు. పిడిగుద్దులతో ముఖంపై తీవ్రంగా దాడి చేశారు. వారు దాడిలో గాయపడ్డ సంజయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సంజయ్ పడిపోవడాన్ని చూసిన ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు. ఇదంతా పెట్రోల్ బంక్ లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బంక్ సిబ్బంది వెంటనే సంజయ్ ను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజయ్ ప్రాణాలు కోల్పోయాడు. 

నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నా

తాగొచ్చి గొడవకు దిగి సంజయ్ ను కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులను వెంటనే పట్టుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని జన్వాడ గ్రామస్థులు ధర్నాకు దిగారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి గ్రామస్థులను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. హంతకులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు రాస్తారోకో నిలిపివేశారు. సంజయ్ మృతితో తన కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. బంక్ లో పని చేస్తున్న కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లడం పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. 

అత్యాచారం, దొంగతనం కేసుల్లో ప్రధాన నిందితులు

ఈ హత్యోదంతంపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూప్ గా గుర్తించారు. పారిపోయిన ముగ్గురు వ్యక్తులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ముగ్గురిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని, అత్యాచారం, దొంగతనం కేసుల్లో ప్రధాన నిందితులను పోలీసులు తెలిపారు. గత నెలలో ఓ విలేకరిపైనా దాడి చేసినట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.

Published at : 07 Mar 2023 02:38 PM (IST) Tags: Telangana Latest Crime News Rangareddy news Youth Attack Petrol Pup Staff Rangareddy Murder

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TS SSC Exams: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!

TS SSC Exams: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

“ఆరోగ్య మహిళ" స్కీమ్ అంటే ఏంటి? ఏయే టెస్టులు చేస్తారో తెలుసా

“ఆరోగ్య మహిళ

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల