అన్వేషించండి

Telangana CM KCR విధానాలు దేశానికి ఆదర్శం, రాహుల్ గాంధీ మాత్రం కాపీ కొట్టారు: బోయినపల్లి వినోద్ కుమార్

Boinapally Vinod Kumar: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని రాహుల్ గాంధీ కొత్తగా వరంగల్ డిక్లరేషన్ పేరిట ప్రకటించారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.

Boinapally Vinod Kumar Comments On Rahul Gandhi: తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ విధానం దేశానికి ఆదర్శమని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వాటినే కాపీ కొట్టారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన వల్ల రాష్ట్రానికిగానీ, దేశానికిగానీ ఒరిగిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే డిక్లేర్ చేసి అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని రాహుల్ గాంధీ కొత్తగా వరంగల్ డిక్లరేషన్ పేరిట ప్రకటించారు. తెలంగాణ వ్యవసాయ విధానం యావత్ దేశానికి ఆదర్శమని, సీఎం కేసీఆర్ గతంలోనే డిక్లేర్ చేసి ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట ప్రకటించారని, ఇందులో కొత్త దనం ఏమీ లేదని పేర్కొన్నారు.

ప్రిపరేషన్ లేకుండా తెలంగాణకు వచ్చి.. !
రాహుల్ గాంధీకి రాష్ట్రం పట్ల, రైతుల పట్ల ఉన్న వైఖరి ఏమిటో వరంగల్ సభ ద్వారా తేటతెల్లం అయిందని వినోద్ కుమార్ అన్నారు. పైపెచ్చు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా రాష్ట్ర పర్యటనకు వచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ పలుమార్లు ప్రశంశలు కురిపించిందని వినోద్ కుమార్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని రాహుల్ గాంధీ అనుసరించారని,  ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సహా దేశవ్యాప్త పార్టీల నాయకులు కేసీఆర్ వ్యవసాయ విధాన మార్గాన్ని అనుసరించక తప్పని పరిస్థితి నెలకొందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

తెలంగాణ పథకాలనే కాపీ కొట్టారు
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలనే రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించారని, టీఆర్ఎస్ విధానాలను కాపీ కొట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఇప్పటికే అమలు చేస్తోందని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించిందన్నారు. రైతుల పాలిట శాపంగా మారిన నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల విక్రయదారుల ఆట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ ను ఇప్పటికీ అమలు చేస్తోందని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్లో చెప్పిందని వినోద్ కుమార్ గుర్తుచేశారు.

ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశంలో పుష్కలంగా సాగునీరు సౌకర్యం కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన తెలిపారు. కాలేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందిస్తున్నామని, కానీ కాంగ్రెస్ డిక్లరేషన్ లో కొత్తదనం ఏమీ లేదు. ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ రికార్డులు అన్నింటిని, భూముల వివరాలన్నీ పక్కాగా పొందుపరుస్తున్నామని, కానీ కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ ద్వారా మళ్లీ పట్వారి వ్యవస్థను తీసుకువచ్చేందుకు కుట్ర  పన్నుతున్నట్లుగా స్పష్టమవుతోందని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు సహా అనేక పరిశ్రమలు మూత పడటానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తామని అంటున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ప్రతి గింజ కొనుగోలు..
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, కోవిడ్ కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్దకు వెళ్లి ప్రతి కొనుగోలు చేసిందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు విమోచన సమితి ద్వారా రైతులను ఆదుకుంటున్నమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ విధానం దేశంలోనే అత్యుత్తం అన్నారు. రైతులను, ప్రజలను మోసం చేసే మాటలు కట్టిపెట్టాలని వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి వినోద్ కుమార్ సూచించారు.


మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget