అన్వేషించండి

Hyderabad News: వామ్మో వీడు మామూలోడు కాదు, ఏకంగా హైకోర్టు జడ్జి వేషం - ఆపై భారీగా మోసాలు!

సులువుగా డబ్బు సంపాదించడానికి ఓ కేటుగాడు హైకోర్టు జడ్జి అవతారం ఎత్తాడు. పైగా గన్‌మెన్‌ను నియమించుకున్నాడు. ఫేక్ వెబ్ ‌సైట్ తయారు చేయించి అమాయక ప్రజలను దోచేస్తున్నాడు.

సులువుగా డబ్బు సంపాదించడానికి ఓ కేటుగాడు హైకోర్టు జడ్జి అవతారం ఎత్తాడు. పైగా గన్‌మెన్‌ను నియమించుకున్నాడు. ఫేక్ వెబ్ ‌సైట్ తయారు చేయించి అమాయక ప్రజలను దోచేస్తున్నాడు. ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని, అతడికి సహకరించిన వ్యక్తిని మల్కాజ్ గిరి ఎస్ఓటీ, ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. 

సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ అనే వ్యక్తి.. ఈజీ మనికి అలవాటు పడ్డాడు. తాళం వేసి ఉన్న ఇండ్లల్లో చోరీలు, వాహనాలు దొంగతనాలు చేసేవాడు. ఈ నేపథ్యంలో 2017లో నరేందర్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఆ తరువాత హైటెక్ మోసాలకు తెర తీశాడు. జమ్మూకాశ్మీర్ ఆర్మీలో పని చేసిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని గన్ మె‌న్‌గా నియమించుకున్నాడు.

ప్రజలను ఈజీగా మోసం చేసేందుకు ఒక నకిలీ వెబ్ సైట్ తయారు చేయించుకుని.. ప్రజలకు కోర్టు జడ్జిగా ప్రచారం చేసుకున్నాడు. భూ సమస్యలు ఏమైనా ఉన్నా తాను పరిష్కరిస్తానంటూ అమాయక ప్రజలకు ఎరవేసేవాడు. లక్షలు వసూలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జిగా మోసాలకు పాల్పడుతుండంతో పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి వచ్చాక ఖమ్మం నుంచి మకాం హైదరాబాద్‌కు మార్చాడు. 

హైదరాబాద్‌లో అడిషనల్ సివిల్ జడ్జిగా నరేందర్ చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ కు చెందిన సోమిరెడ్డి అనే వ్యక్తి ల్యాండ్ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి అతడి వద్ద నుంచి రూ.10 లక్షలు వసూల్ చేశాడు. తన భూ సమస్యను పరిష్కరించకపోవడంతో మోసపోయానని గ్రహించిన సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణలో అసలు విషయం అర్థమైంది.. నరేందర్ నకిలీ జడ్జిగా చలామణి అవుతూ మోసగిస్తున్నట్లు గుర్తించారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నిందితుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి.

జడ్జిగా నమ్మించేందుకు భారీ సెటప్

ప్రజలను సులువుగా మోసం చేసేందుకు నరేందర్ భారీ సెటప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకోసం సాంకేతికతను ఉపయోగించుకున్నాడు. నకిలీ వెబ్  సైట్ తయారు చేయించుకున్నాడు. నకిలీ విజిటింగ్ కార్డులు ముద్రించాడు. తనకు ప్రభుత్వం గన్‌మెన్‌ను కేటాయించిందని నమ్మించేందుకు ప్రత్యేకంగా గన్‌మెన్‌ను నియమించుకున్నాడు. ఎంత చేసినా ఎప్పటికైనా దొంగ పోలీసులకు దొరకాల్సిందే. అలాగే ఓ సెటిల్‌మెంట్ వ్యవహారంలో పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడి నుంచి పోలీసులు ఒక తుపాకీ, 5 బుల్లెట్లు, ఒక కారు, ఒక మొబైల్, క్యాష్, నకిలీ విజిటింగ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget