Traffic Restrictions: హైదరాబాదీలు జర సోచో, ఆ ప్రాంతాల్లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు!
Traffic Restrictions: ఈరోజు, రేపు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Traffic Restrictions: శుక్రవారం, శనివారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి రాబోతున్నారు. ఈ క్రమంలోనే శుక్ర, శని వారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు.. 17వ తేదీ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీటీఓ జంక్షన్, పీఎన్బీ ఫ్లైఓవర్, జంక్షన్, హెచ్పీఎస్ స్కూల్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్డు, ఎంఎంటీఎస్, వీవీ స్టాచ్యూ జంక్షన్, పంజాగు్ట జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు తలెత్తాయి. సికింద్రాబాద్ నుంచి వయా బేగంపేట మీదుగా అమీర్ పేట, మెహదీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ రూట్ లో రాకుండా అప్పర్ ట్యాంక్ బండ్ పై దారి మళ్లించనున్నారు. రాజ్ భవన్ రోడ్, మొనప్ప జంక్షన్, వీవీ స్టాచ్యూ ఈ మార్గాల్లో రెండువైపులా రోడ్ మూసేశారు.
Date: 15-06-2023 at 1420 hrs
— Hyderabad Traffic Police (@HYDTP) June 15, 2023
Due to VIP movement and heavy flow of traffic, Movement of Vehicle is slow from CHutneys, NFCL, Panjagutta, Somajiguda Circle, Camp Office towards Greenlands.Panjagutta traffic police are available and regulating traffic. pic.twitter.com/bAMcD9yHr6
Date: 15-06-2023 at 1425 hrs:
— Hyderabad Traffic Police (@HYDTP) June 15, 2023
ue to heavy flow of vehicles near NASR School, movement of vehicles is slow from NMDC,Masab Tank,Mahaveer Hospital,PTI, Ayodhya Jn.,Nirankari,Shadan College towards VV Statue. Asif nagar & Saifabad traffic police are available and regulating traffic. pic.twitter.com/F7zwYp6Oj0
పంజాగుట్ట రాజ్ భవన్ క్వార్టర్స్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు. సీటీఓ జంక్షన్, మినిస్టర్ రోడ్డులో వచ్చే వాహనాలను రసూల్ పురా జంక్షన్ వద్ద కొంత సమయం పాటు నిలిపివేస్తారు. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్ మీదుగా బేగంపేట ఎయిర్ పోర్టు మీదుగా వచ్చే వాహనాలను ప్రకాష్ నగర్ టీ జంక్షన్ వద్ద కొంత సమయం నిలుపుదల చేస్తారు. ఈ రూట్ లలో ప్రయాణించే వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు. విషయం తెలియకుండా వస్తే ట్రాఫిక్ లో ఇరుక్కు పోవాల్సిందేనని చెప్పారు. అసలే ఎండాకాలం కాబట్టి త్వరగా ఇళ్లకు, ఆఫీసులకు వెళ్లిపోయే ప్రయత్నం చేయాలన్నారు.
Date: 15-06-2023 at 1822 hrs
— Hyderabad Traffic Police (@HYDTP) June 15, 2023
Due to heavy flow of traffic and peak hours, Movement of Vehicle is slow from Shoppers Stop,Prakash Nagar T Jn.,Rasoolpura,Begumpet Police Lines,Anand Theatre,Paradise X Roads towards Gymkhana grounds. pic.twitter.com/KkAHarRtKz