By: ABP Desam | Updated at : 01 Oct 2023 03:43 PM (IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
PM Modi In Mahabubnagar:
మహబూబ్‌నగర్: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. గత ఎన్నికల సమయంలో నిజమాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారని బీజేపీ నేతలపై విమర్శలున్నాయి. ఈ క్రమంలో మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతకుముందు మహబూబ్‌నగర్ నుంచి 13,500 కోట్లతో చేపట్టనున్న పలు రకాల అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇందులో జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులున్నాయి.
ప్రధాని మోదీ నాగ్ పూర్- విజయవాడ ఎకనమిక్ కారిడార్ కు శంకుస్థాపన చేశారు. భారత్ పరియోజన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్- విశాఖపట్నం కారిడార్ ను జాతికి అంకితం చేశారు. ఆయిల్ అండ్ గ్యాస్ ఫైప్ లైన్ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్- రాయచూరు ట్రైన్ ను ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు చెందిన ఆరు కొత్త భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించారు.
పాలమూరులో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి తర్వాత ప్రపంచానికి పసుపు గొప్పదనం తెలిసిందన్నారు. దాంతో పలు దేశాలలో పసుపుపై పరిశోధనలు పెరిగాయని తెలిపారు. దేశంలో అత్యధికంగా తెలంగాణలో పసుపు ఉత్పత్తి అవుతుందని తెలిసిందే. రాష్ట్రంలో పసుపు రైతులకు ప్రయోజనం కలుగుతుందని పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు.
తెలంగాణకు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. రూ.900 కోట్ల వ్యయంతో ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క గిరిజన యూనివర్సిటీ పేరుతో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాజాగా చేపట్టిన వేల కోట్ల పనులతో ఎన్నో వేల మందికి ఉపాధి దొరుకుతుందని, ప్రయోజనం కలుగుతుందన్నారు. మరోవైపు తెలంగాణలో పలు జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని, వాటికి నిధులు అందిస్తున్నామని చెప్పారు. హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణ అనుసంధానం పెరిగిందన్నారు.హన్మకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్క్‌తో వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం అన్నారు.
అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నారని మంత్రి కేటీఆర్ ఇటీవల తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ కు చేరుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా శంకుస్థాపనలతో పాటు కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు.
Rythu Bharosa Funds: గుడ్‌న్యూస్, రైతుభరోసా విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ - రుణమాఫీపైనా కీలక ఆదేశాలు
CH Malla Reddy: రేవంత్ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి ఒకే ఒక రిక్వెస్ట్ - ఏంటో తెలుసా?
Jana Reddy News: ఎంపీగా పోటీ చేయడానికి రెడీ, నా కుమారుడికి పదవులు అడగను - జానా రెడ్డి
TS LAWCET: తెలంగాణ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం, 13 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
Google Map: గౌరవెల్లి ప్రాజెక్టులోకి దారి చూపిన గూగుల్ మ్యాప్-తృటిలో తప్పించుకున్న డీసీఎం డ్రైవర్
TSPSC Chairman Resigns: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
/body>