By: ABP Desam | Updated at : 19 Feb 2023 10:33 AM (IST)
తారకరత్నకు నివాళులు అర్పించాక మాట్లాడుకుంటున్న విజయసాయి, ఎన్టీఆర్
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో నిన్న (ఫిబ్రవరి 18) కన్నుమూసిన నటుడు తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలోని మోకిలలోని ఆయన సొంత ఇంటికి తారకరత్న భౌతిక కాయాన్ని చేర్చారు. ఆయన్ను ఆఖరిసారి చూసేందుకు సీని ప్రముఖులు, కుటుంబ సభ్యులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
తారకరత్న మృతిపై ప్రధాని కార్యాలయం ట్వీట్
నటుడు తారకరత్న మృతి తనను ఎంతో బాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ‘‘సినిమాలు, ఎంటర్‌టైన్‌రంగంలో తారకరత్న తనదైన ముద్రవేశారు. ఆయన మృతి నన్ను ఎంతో బాధించింది. తారకరత్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. ఓంశాంతి’’ అని ట్వీట్ చేశారు.
Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 19, 2023
తారకరత్న మరణంపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు శ్రీ నందమూరి తారకరత్న మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.#NandamuriTarakaRatna
— Telangana CMO (@TelanganaCMO) February 18, 2023
తారకరత్నకు ఎంపీ విజయసాయి రెడ్డి నివాళులు
మోకిలలోని సొంతింట్లో ఉన్న తారకరత్న భౌతికకాయం వద్దకు వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్లి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యంతో తారకరత్న తిరిగివస్తాడని అనుకున్నామని, విధి మరోలా తలచిందని వాపోయారు. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని అన్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
తారకరత్న భౌతికకాయానికి కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ నివాళి
సినీ నటుడు తారకరత్న భౌతిక కాయానికి ఆయన సోదరులు కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ నివాళి అర్పించారు. మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న వారు పార్థివ దేహాన్ని చూసిన భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడే ఉన్న విజయసాయిరెడ్డితో ఎన్టీఆర్ మాట్లాడారు.
TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?
TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!
TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!
Hyderabad News : నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !
దమ్ముంటే సిట్‌కు బీజేపీ నేతలు ఆధారాలు ఇవ్వాలి- మంత్రి జగదీశ్ రెడ్డి
Breaking News Live Telugu Updates: ఆకాశంలోకి LVM3 -M3 రాకెట్, ఏకంగా 36 ఉపగ్రహాలు మోసుకెళ్లిన వాహకనౌక
BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?
BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే