Modi Hyderabad Visit Live:రామానుజాచార్యుల విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన వివరాలకు సంబంధించి లైవ్ అప్ డైట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE

Background
రామానుజాచార్యుల విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ
హైదరాబాద్ ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి రోజున జాతికి అంకితం ఇచ్చారు. పంచలోహాలతో రూపొందించిన ఈ విగ్రహం కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహం. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాలు నిర్మించారు. సమతామూర్తి కేంద్రాన్ని ఎల్ఈడీ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్వహించిన యాగంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యాగశాలలో ప్రధానికి చినజీయర్ స్వామి స్వర్ణకంకణం అలంకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.
108 వైష్ణవ ఆలయాలు సందర్శిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
108 వైష్ణవ ఆలయాలను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శిస్తున్నారు. అనంతరం సమతాస్ఫూర్తి కేంద్రం రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. నేతలు బండి సంజయ్, సుధాకర్ రెడ్డి సమతా స్ఫూర్తి కేంద్రంలో మోదీకి స్వాగతం పలికారు.
యాగశాల నుంచి సమతా స్ఫూర్తి కేంద్రానికి బయలుదేరిన ప్రధాని
యాగశాల నుంచి ముచ్చింతల్ సమతా స్ఫూర్తి కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ బయలుదేరారు. తొలుత 108 వైష్ణవ ఆలయాలను ప్రధాని సందర్శించనున్నారు.
విష్వక్సేనేష్ఠి యాగం పూర్ణాహుతి చేసిన ప్రధాని మోదీ
యాగశాలలో ప్రధాని నరేంద్ర మోదీకి చినజీయర్ స్వామి స్వర్ణ కంకణం కట్టారు. అనంతరం ప్రధాని, గవర్నర్ విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్నారు. విష్వక్సేనేష్ఠి యాగం పూర్ణాహుతి చేశారు.
శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొన్న ప్రధాని మోదీ
యాగశాలకు చేరుకున్న ప్రధాని మోదీ శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొన్నారు. మరో యాగంలోనూ ప్రధాని మోదీ పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

