అన్వేషించండి

Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌‌పై నౌహీరా షేక్ సంచలన ఆరోపణలు - ఒకరిపై మరొకరు ఫిర్యాదులు!

Nowhera Shaikh Vs Bandla Ganesh:నౌహీరా షేక్ ఆరోపణలు చేయడానికి ముందు రోజే ఈ విషయంలో బండ్ల గణేష్‌ కుమారుడు పోలీసులను ఆశ్రయించారు.

Nowhera Shaikh Allegations on Bandla Ganesh: హీరా గోల్డ్ స్కామ్ లో ప్రధాన నిందితురాలు, హీరా గ్రూప్‌ అధినేత నౌహీరా షేక్ బండ్ల గణేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. బండ్ల గణేశ్‌ తన ఇంటిని కాజేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. బంజారా హిల్స్‌ రోడ్ నెంబర్ 10లోని తన కార్యాలయంలో నౌహీరా షేక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రూ.75 కోట్ల విలువ చేసే తన ఇంటిని బండ్ల గణేష్ కబ్జా చేయాలని ఆయన ప్రణాళిక వేశారని ఆమె ఆరోపించారు. 

ఫిలింనగర్‌ లో ఉన్న సుమారు రూ.75 కోట్ల విలువైన తన ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్‌ను బండ్ల గణేశ్‌కు అద్దెకిచ్చామని నౌహీరా షేక్ చెప్పారు. 2021 జూన్‌ 5న ఆయనకు అద్దెకు ఇచ్చామని 11 నెలలు రెంటల్‌ అగ్రిమెంట్‌ కూడా చేశామని నౌహీరా షేక్ తెలిపారు. అద్దె గడువు ముగిసినా కూడా తన ఇంటిని బండ్ల గణేష్ ఖాళీ చేయలేదని ఆరోపించారు. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తన ఇంటిని అటాచ్‌ చేశారని తెలుసుకున్న బండ్ల గణేశ్‌.. అడ్డదారిలో ఇల్లు మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారని అన్నారు. 11 నెలలు చేసిన రెంటల్‌ అగ్రిమెంట్‌ను ఫోర్జరీ చేసి 9 ఏళ్లు అద్దెకు తీసుకున్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడని ఆరోపించారు. తక్కువ ధరకు ఇంటిని అమ్మాలంటూ ఒత్తిడి కూడా తనపై తీసుకువస్తున్నారని ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో ఆ ఇంటికి గత గురువారం మధ్యాహ్నం తాను వెళ్లగా రౌడీల సాయంతో దౌర్జన్యానికి దిగారని వివరించారు. పైగా తనపైనే ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఇంటిని ఆక్రమించుకున్న బండ్ల గణేశ్‌ పై చర్యలు తీసుకోవాలని తాను పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆయనకే మద్దతుగా ఉన్నారని అన్నారు. ఈ వైఖరిపై తాను డీజీపీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. సోమవారం ఈ విషయంలో తాను సీపీని కలుస్తానని చెప్పారు. తనకు రాజకీయ నాయకులు తెలుసని బండ్ల గణేశ్‌ బెదిరిస్తున్నారని అన్నారు. 

ముందురోజే బండ్ల కుమారుడి ఫిర్యాదు
నౌహీరా షేక్ ఆరోపణలు చేయడానికి ముందు రోజే ఈ విషయంలో బండ్ల గణేష్‌ కుమారుడు పోలీసులను ఆశ్రయించారు. ఈడీ కస్టడీలో ఉన్న ఇంటిని తమకు అమ్మాలని ఆమె ప్రయత్నించిందని.. తమ వద్ద డబ్బు తీసుకుని మరీ ఇంటిని ఖాళీ చేయాలంటూ రౌడీలతో దౌర్జన్యానికి దిగుతోందంటూ నౌహీరా షేక్‌పై ఫిర్యాదు చేశాడు. నౌహీరా షేక్‌ తాము అద్దెకు ఉంటున్న ఇంటిని అమ్ముతున్నట్లుగా చెప్పడంతో తామే కొంటామని.. గత ఏడాది మార్చి 23న ఆమెకు రూ.3 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చామని బండ్ల కుమారుడు వివరించారు. మిగతా మొత్తాన్ని కూడా జమ చేస్తున్న సమయంలో ఆ ఇల్లు ఈడీ కస్టడీలో ఉందని తెలిసిందని అన్నారు.

అయితే తాము ఆ ఇంటిని కొనడం లేదని తేల్చేశామని చెప్పారు. నౌహీరా మాత్రం మిగతా డబ్బులు చెల్లించేదాకా ఒత్తిడి తెచ్చిందని అన్నారు. తమ అడ్వాన్స్ డబ్బులు రూ.3 కోట్లు కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఈ నెల 15న మధ్యాహ్నం నౌహీరా షేక్‌ 10 మంది రౌడీలతో కలిసి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిందని.. ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడిందని, అసభ్య పదజాలంతో దూషించిందని బండ్ల కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

హీరో గోల్డ్‌ గ్రూప్ అధినేత్రి అయిన నౌహీరా షేక్ రూ.5 వేల కోట్ల విలువైన మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమెకు చెందిన భూముల్ని, ఆస్తుల్ని కూడా ఈడీ జప్తు చేసింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget