By: ABP Desam | Updated at : 13 Apr 2022 05:53 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) విద్వేషపూరిత వ్యాఖ్యల కేసును నాంపల్లి కోర్టు (Nampalli Court) కొట్టివేసింది. ఆయనపై ఉన్న పదేళ్ల నాటి రెండు కేసులను స్పెషల్ సెషన్స్ జడ్జి కొట్టివేశారు. దాదాపు పదేళ్ల తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కేసు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి రెచ్చగొట్టేలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి మాట్లాడవద్దని కోర్టు అక్బరుద్దీన్‌ను ఆదేశించింది. అవి దేశ సమగ్రతకు మంచిది కాదని, ఇదేదో విజయంలాగా భావించొద్దని కోర్టు పేర్కొంది. దీంతో అక్బరుద్దీన్‌కు భారీ ఊరట కలిగినట్లయింది.
అసలేం జరిగిందంటే..
నిర్మల్‌లోని నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్ లో పదేళ్ల క్రితం అంటే 2012 డిసెంబరులో మజ్లిస్ పార్టీ (AIMIM) ఓ బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది. ఆ సభలో ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరితంగా (Akbaruddin Owaisi Hate Speech) మాట్లాడారు. ఆ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపాయి.
ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే... ‘‘మీరు 100 కోట్ల మంది.. మేం కేవలం 25 కోట్ల జనాభా మాత్రమే మాత్రమే.. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తాం..’’ అంటూ అక్బరుద్దీన్ (Akbaruddin Owaisi Hate Speech) ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై ఐపీసీ 120- బీ (నేరపూరిత కుట్ర), 153 ఏ (రెండు గ్రూపుల మధ్య మతం పేరుతో విద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడడం), 295 ఏ (ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలు, ఏ వర్గం వారి మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేయడం), 298 (ఏదైనా వ్యక్తి యొక్క మతపరమైన భావాలను భంగం కలిగేలా ఉద్దేశపూర్వక ప్రసంగం), 188 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు.
ఆ సమయంలో అక్బరుద్దీన్ లండన్ వెళ్లిపోయారు. ఆయన తిరిగి వచ్చాక పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన అక్బరుద్దీన్ అప్పట్లో 40 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. ఇదే కాకుండా నిజామాబాద్ లోనూ అక్బరుద్దీన్ హిందూ దేవతల పైన అనకూడని వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసులను విచారణ జరిపిన కోర్టు పదేళ్ల తర్వాత ఆయనపై నమోదైన కేసులను కొట్టివేసింది.
Breaking News Live Updates : ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం
CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు
Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Weather Updates : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Stock Market News: శుక్రవారం డబ్బుల వర్షం! రూ.5.5 లక్షల కోట్లు ఆర్జించిన ఇన్వెస్టర్లు, సెన్సెక్స్ 1163+
Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!
Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి
CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!