అన్వేషించండి

Manda Krishna Madiga: మాలలతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు, మాదిగలకు కాంగ్రెస్ తీరని అన్యాయం: మందకృష్ణ ఫైర్

Telangana News: మాలలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని, అందుకే ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించలేదని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాలలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి విలువల్లేని, విధానాలు లేని రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గుణపాఠం తప్పదని అన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.
మరోసారి మాదిగలకు తీరని అన్యాయం
‘కడియం శ్రీహరి కూతురు కావ్యకి కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ కేటాయించింది. మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాలు ఉంటే.. మూడు స్ధానాలను మాదిగలకు కేటాయించ లేదు. కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయమే చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాదిగలను జనాభా లెక్కల నుంచి తీసేసింది. కాంగ్రెస్ పార్టీలో మాలలకు తప్ప మాదిగలకు సముచిత స్థానం లేదు. స్థానికుడు కాకపోయినా నాగర్ కర్నూల్ టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం మాజీ ఎంపీ మల్లు రవికి కేటాయించింది. వరంగల్ ఎస్సీ పార్లమెంట్ స్థానాన్ని మాదిగలకు ఇస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించారు. సొంత పార్టీ నాయకులు వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించి భంగం పడ్డారు. ఊరికి ఒక్కరు లేని బైండ్ల సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయించారు. తెలంగాణలో నూటికి 70 శాతం ఉన్న మాదిగలకు గుర్తించడం లేదు’ - మందకృష్ణ మాదిగ

కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతాం అన్నారు. మేము ఏంటో సీఎం రేవంత్ రెడ్డికి చూపిస్తాం. మాదిగలే తన గెలుపునకు దోహద పడ్డారన్న రేవంత్ రెడ్డి ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టికెట్ ఇవ్వ లేదు? అని ప్రశ్నించారు. రెడ్డి సామాజికవర్గానికి తప్ప.. ఎవరికీ న్యాయం చేయలేదని విమర్శించారు. చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చారు. కానీ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చేరితే మాత్రం అతడికి టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మెజార్టీ అభ్యర్థులు రెడ్డిలకే కేటాయించారు.12 స్థానాల్లో మెజార్టీ స్థానాలు రెడ్డిలే ఉన్నారు. మాదిగలతో పాటు బీసీలకి కూడా రేవంత్ రెడ్డి అన్యాయం చేశారని మందకృష్ణ మాదిగ విమర్శించారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget