News
News
వీడియోలు ఆటలు
X

Modi In Hyderabad: మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్‌లో మార్పులు - కారణం ఏంటంటే

ఓ అరగంట ముందుగానే హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నారు. ముందుగానే హైదరాబాద్ వచ్చి తర్వాత పావుగంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అవ్వనున్నారు.

FOLLOW US: 
Share:

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (మే 26) హైదరాబాద్ కు రానున్న వేళ ఆయన పర్యటన విషయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయన హైదరాబాద్‌కు మధ్యాహ్నం 1.25కు చేరుకోవాల్సి ఉండగా, కాస్త ముందుగా 12.50 నిమిషాలకు రానున్నారు. ఓ అరగంట ముందుగానే హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నారు. ముందుగానే హైదరాబాద్ వచ్చి తర్వాత పావుగంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అవ్వనున్నారు. ఆ తర్వాత బేగంపేట్‌ నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకోనున్నారు. అయితే, నిన్ననే బండి సంజయ్ మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదంగా చేసిన వేళ ఇప్పుడు బీజేపీ నేతలతో మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదీ (తొలుత ప్రకటించిన ప్రకారం..):
* మే 26న మధ్యాహ్నం 1 .30 గంటల కి బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ 
* 1.45  వరకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్  పార్కింగ్ లో బీజేపీ నేతలతో మీటింగ్ 
* 1.50 కి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ హెలిప్యాడ్‌కు మోదీ. హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన 2 కి.మీ. ప్రయాణించి ఐఎస్‌బీకి
* మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ 
* తిరిగి సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు మోదీ 
* 4 .15 గంటలకు  బేగంపేట్ నుంచి చెన్నై కి బయలుదేరనున్న ప్రధాని 

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
మరోవైపు, మోదీ పర్యటన వల్ల హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు గురువారం అమల్లో ఉండనున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

* లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వచ్చే వాహనదారులు హెచ్‌సీయూ డిపో వద్ద లెఫ్ట్ తీసుకొని, మసీద్ బండ కమాన్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని, కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, బొటానికల్ గార్డెన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని గచ్చిబౌలికి రావాల్సి ఉంటుంది.

* విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకొని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి ఎక్స్ రోడ్డులో రైట్ టర్న్ తీసుకొని, HCU బ్యాక్ గేట్ నుంచి నల్లగండ్ల మీదుగా లింగంపల్లి చేరుకోవాలి.

* విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. విప్రో జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని, ఓఆర్ఆర్ రోడ్డు, ఎల్ అండ్ టీ టవర్స్ ద్వారా గచ్చిబౌలి జంక్షను చేరుకోవచ్చు.

* కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. కేబుల్ బ్రిడ్జి అప్లమ్ రోడ్డు నంబర్-45, మాదాపూర్ రత్నదీప్, మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ ద్వారా గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుకోవచ్చు.

* గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని, బొటానికల్ గార్డెన్ వద్ద లెఫ్ట్ తీసుకొని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, మసీద్ బండ, మసీద్ బండ కమాన్, HCU డిపో రోడ్డు గుండా లింగంపల్లికి వెళ్లాల్సి ఉంటుంది.

Published at : 26 May 2022 12:16 PM (IST) Tags: Telangana BJP Modi Hyderabad tour Modi tour schedule Modi tour schedule change

సంబంధిత కథనాలు

Bandi Sanjay on TDP:

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్