Teenmar Mallanna Latest News: తీన్మార్ మలన్న సమరానికి సిద్ధమవుతున్నారా! రేవంత్‌పై తిరుగుబాటు చేస్తారా?
Teenmar Mallanna Latest News:బీసీ గణనపై విమర్శలు చేస్తున్న తీన్మార్ మల్లన్న యుద్ధానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. షోకాజ్ నోటీసులపై చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్న తీరు ఆ విషయం గట్టిగా ధ్వనిస్తోంది.

Teenmar Mallanna Latest News: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణన ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. దీనిపై ప్రతిపక్షాల కంటే ముందుగానే కాంగ్రెస్ నేతలే ఫైర్ అవుతున్నారు. బీసీల జనాభా తగ్గించేసి అగ్రకులాలకు పెద్ద పీట వేశారని ఆరోపిస్తున్నారు. అలా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం వినిపించిన మొదటి వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆ కులగణన సర్వేను జానారెడ్డి లెక్కలతో ఆయన పోల్చి తగులబెట్టారు. దీంతో కాంగ్రెస్‌లో ఒక్కసారిగా రాజకీయం కాక రేపింది.
బీసీ గణనకు కాంగ్రెస్ పట్టు
దేశంలో బీసీ కులగణనపై కాంగ్రెస్ పార్టీ ఓ స్టాండ్ తీసుకొని పోరాటం చేస్తోంది. బీసీలకు రాజ్యాంగబద్దమైన పదవుల్లో పెద్ద పీట వేసేలా వారి జనాభాపై గణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడం పక్కన పెడితే సొంత పార్టీలో కుంట్లకు కారణమవుతోంది.
అదే ప్రచారం తెలంగాణలో
కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనకు అనుగుణంగా తెలంగాణలో ప్రభుత్వ నడుచుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, ఎన్నికల సందర్భంలో, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీ కులగణనపై ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ చేశారు. ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
యాభై రోజుల్లో సర్వే పూర్తి
అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత బీసీ గణనపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి యాభై రోజుల్లోనే సర్వే పూర్తి చేసి బీసీ గణన పూర్తి చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా సర్వే ఫలితాల చాలా మందికి ఆగ్రహం తెప్పించాయి. గతంలో ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలకు ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలకు చాలా తేడాలు ఉన్నాయని ఫైర్ అవుతున్నారు.
సొంత పార్టీలోనే కాక
ఇదంతా ప్రతిపక్షాలు చేస్తే ఎలాంటి అధికార పార్టీ ఏదో ప్రతి విమర్శలతో సమాధానం చెప్పుకోగలుగుతుంది. కానీ సొంత పార్టీలో సర్వే వివాదం ఇప్పుడు కాంగ్రెస్‌లో కాకపుట్టిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ సర్వేను పూర్తిగా తప్పుపట్టారు. సర్వే బయటకు వచ్చిన రోజే వాటిని మంటల్లో కాల్చి బూడిద చేశారు. అంతేకాకుండా సొంత పార్టీలోని ఓ వర్గం నేతలపై మండిపడ్డారు. వాళ్ల ప్రభావంతోనే తప్పుడు లెక్కలతో సర్వే అంటూ ప్రజల ముందు ఉంచారని విమర్శలు చేశారు.
లీడ్ తీసుకున్న మల్లన్న
ఓ సామాజిక వర్గంపై చేసిన కామెంట్స్‌తోపాటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న స్టాండ్‌పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తీన్మార్ మల్లన్నపై గుర్రుగా ఉంది. అన్నింటికీ సమాధానం చెప్పాలని ఆయనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Also Read: స్థానిక ఎన్నికల్లో అత్యధికం ఏకగ్రీవం చేసుకోండి - ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్ దిశానిర్దేశం
ఇప్పుడు ఈ షోకాజ్ నోటీసుపై కూడా మల్లన్న మండిపడుతున్నారు. బీసీల కోసం మాట్లాడితే నోటీసులు ఇస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ కులగణనను తప్పుదారి పట్టించిన వారికే నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది బీసీల జనాభాను గల్లంతు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీని బీసీల నుంచి దూరం చేయాలని కొందరు చూస్తున్నారని మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం స్టాండ్ క్లియర్‌గానే ఉందని కానీ రాష్ట్ర ప్రభుత్వం తీరే అభ్యంతరంకరంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే బీసీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చేలా చేస్తున్నారని మండిపడ్డారు. తాను నమ్మే బీసీలు ఈ నోటీసులు సమాధానం ఇవ్వమంటే పన్నెండో తేదీలోపు ఆన్సర్ చేస్తానని అన్నారు.
ఇక తిరుగుబాటే!
తీన్మార్ మల్లన్న ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాను గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పోరాడినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఎక్కడ పడుకున్నారనే మాటలు అందులో భాగమేనంటున్నారు. తనపై విమర్శలు చేసే వారంతా రాజీనామా చేస్తే తానూ రాజీనామా చేస్తానని ఎవరిబలం ఎంతో తెలుస్తుందని సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు మల్లన్న రెడీ అవుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
Also Read: గజ్వేల్‌లో పోటాపోటీ బహిరంగసభలకు ప్లాన్ - కేసీఆర్, రేవంత్ బలప్రదర్శనకు రెడీ !





















