News
News
X

Twitter War: అన్నీ కాంగ్రెస్ హత్యలే; ‘చంద్ర’గ్రహణంలా దాపురించారు - కవిత, రేవంత్ రెడ్డి ట్విటర్ వార్

‘‘ఎంపీగా ఓడినా.. అడ్డదారిలో ఎమ్మెల్సీ అయ్యావే. మరి నీతో పాటే నీ పార్టీలో ఉన్న అమరుడు శ్రీకాంత్ చారి తల్లికి ఏ పదవి ఇవ్వలేదేం?’’ అని కాంగ్రెస్ విమర్శించింది

FOLLOW US: 
Share:

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా పరస్ఫర విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న తెలంగాణ దీక్షా దివాస్ సందర్భంగా కవిత చేసిన ఓ ట్వీట్ ఈ పరస్ఫర విమర్శలకు దారి తీసింది. ‘‘కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ‘‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అంటూ, ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, ‌సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు.. నవంబర్ 29, దీక్షా దివాస్’’ అంటూ కవిత చేసిన ట్వీట్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది.

ఇది దీక్షా దివాస్ కాదు.. దగా దివాస్! అంటూ కొట్టి పారేస్తూ కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి రిప్లై ఇచ్చారు. ‘‘ఇది దీక్షా దివాస్ కాదు.. దగా దివాస్! కవిత గారూ. దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినం. దొంగ దీక్ష నాటకమాడిన మీ నాయన సీఎం కుర్చీ ఎక్కిండు.. చిత్తశుద్దితో ఉద్యమం చేసి, బలిదానాలు చేసిన బిడ్డలకు కనీసం గుర్తింపే లేకపాయే!’’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా కవితను కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ‘‘ఎంపీగా ఓడినా.. అడ్డదారిలో ఎమ్మెల్సీ అయ్యావే. మరి నీతో పాటే నీ పార్టీలో ఉన్న అమరుడు శ్రీకాంత్ చారి తల్లికి ఏ పదవి ఇవ్వలేదేం? అమరుల త్యాగాలతో, ప్రజల కష్టంతో, కాంగ్రెస్ మంచి మనసుతో తెలంగాణ వచ్చింది. మీ రాక్షస పాలనతో, ఇప్పుడు రాబందుల తెలంగాణగా మార్చారు.’’ అని మరో ట్వీట్ చేసింది

కవిత కౌంటర్
దీనిపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ‘‘తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారు. ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదు. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ గారు, దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణ రాష్ట్రం తెచ్చారు. తెలంగాణ కోసం జరిగిన ప్రతి బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యే. సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానని నమ్మకం లేక కేరళ రాష్ట్రం వాయనాడ్ వెళ్లారు మీ నాయకుడు రాహుల్ గాంధీ.. ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో మీ పార్టీ పైనే ఎమ్మెల్సీకి పోటీ చేసి గెలిచా’’ అని కవిత వరుసగా ట్వీట్లు చేస్తూ కౌంటర్ ఇచ్చారు.

స్పందించిన రేవంత్ రెడ్డి
‘‘వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే.. బతుకమ్మ ఆడినందుకే.. బోనం కుండలు ఎత్తినందుకే.. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే.. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి!? అమరవీరుల బలిదానాలకు ‘చంద్ర’గ్రహణంలా దాపురించిన మీ కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతెక్కడిది? అందుకే.. త్యాగాలు చేసిందెవరు.. భోగాలు అనుభవిస్తోందెవరని యావత్ తెలంగాణ ఘోషిస్తోంది. అధికార మదంతో మూసుకుపోయిన మీ కళ్లకు, చెవులకు అవి కనబడవు.. వినబడవు.’’ అని రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Published at : 30 Nov 2022 09:06 AM (IST) Tags: MLC Kavitha TRS News Telangana Congress Revanth Reddy telangana deeksha diwas

సంబంధిత కథనాలు

Puvvada Ajay Kumar :మంత్రి పువ్వాడ అజయ్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు

Puvvada Ajay Kumar :మంత్రి పువ్వాడ అజయ్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు

Bandi Sanjay : విజయశాంతి చివరి మజిలీ బీజేపే కావాలి, పార్టీని వీడిన వారంతా తిరిగిరండి- బండి సంజయ్

Bandi Sanjay : విజయశాంతి చివరి మజిలీ బీజేపే కావాలి, పార్టీని వీడిన వారంతా తిరిగిరండి- బండి సంజయ్

Revanth Reddy : ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇవ్వలేదో అక్కడ ఓట్లు అడగొద్దు, కేటీఆర్ సవాల్ కు సిద్ధమా? - రేవంత్ రెడ్డి

Revanth Reddy  : ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇవ్వలేదో అక్కడ ఓట్లు అడగొద్దు, కేటీఆర్ సవాల్ కు సిద్ధమా? - రేవంత్ రెడ్డి

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ పాదయాత్రలో అపశ్రుతి, సొమ్మసిల్లి కిందపడ్డ తారకరత్న

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ పాదయాత్రలో అపశ్రుతి, సొమ్మసిల్లి కిందపడ్డ తారకరత్న

Naresh Vs Ramya Raghupathi: నరేష్-రమ్య రఘుపతి కేసులో ట్విస్ట్! రఘువీరారెడ్డి పేరు కూడా - సంచలన ఆరోపణలు

Naresh Vs Ramya Raghupathi: నరేష్-రమ్య రఘుపతి కేసులో ట్విస్ట్! రఘువీరారెడ్డి పేరు కూడా - సంచలన ఆరోపణలు

టాప్ స్టోరీస్

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Tollywood Deaths, Shocks - 27th Jan : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్

Tollywood Deaths, Shocks - 27th Jan : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2391 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2391 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి!

Balakrishna On Tarakaratna : గుండె నాళాల్లో 90 శాతం బ్లాక్స్ - తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ ఏం చెప్పారంటే ?

Balakrishna On Tarakaratna : గుండె నాళాల్లో 90 శాతం బ్లాక్స్ - తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ ఏం చెప్పారంటే ?