News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

MLA Anil Kumar: అనిల్‌ అనుచరులమంటూ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ ఎదుట వీరంగం 

MLA Anil Kumar: హైదరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ సెక్యూరిటీ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. వారిని ప్రశ్నిస్తే తాము నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులమని చెప్పారు.  

FOLLOW US: 
Share:

MLA Anil Kumar: నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనచరులమని చెప్పుకొన్న కొందరు యువకులు హైదరాబాద్‌లో వీరంగం సృష్టించారు. హైదరాబాద్ లోని ఓ అపార్ట మెంట్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే వాళ్లు అపార్ట్ మెంట్ ఎదుట వీరంగం సృష్టించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తమపై అనవసరంగా దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే అనుచరులతో సహా.. అనిల్ కుమార్ యాదవ్ ను కూడా అరెస్ట్ చేయాలని సెక్యూరిటీ సిబ్బంది కోరుతున్నారు. 

అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్ గచ్చిబౌలి - అపర్ణ సెరెన్ అపార్ట్ మెంట్ లో పార్కింగ్ వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యావద్ అనుచరులు అని చెప్పుకున్న కొందరు వ్యక్తులు అపార్టుమెంట్ ఎదుట ఉన్న రోడ్డుపై వాహనాలు నిలిపారు. అయితే తమ అపార్ట్ మెంట్ రోడ్డుపై పార్కింగ్ చేయవద్దని సెక్యూరిటీ సిబ్బంది వారిని కోరారు. దీంతో వారు కార్లు తీయకుండా గొడవ పడ్డారు. ఎమ్మెల్యే మనుషులకే ఇలా చెప్తారా అంటూ... సెక్యూరిటీ గార్డులపై దౌర్జన్యం ప్రదర్శించారు. ఎమ్మెల్యే అండ ఉందని చెబుతూ అపార్ట్ మెంట్ సెక్యూరిటీపై ప్రతాపం చూపించారు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని తన మనుషులతో చితకబాదించారు. ఈ తతంగం మొత్తాన్ని అపార్ట్ మెంట్ వాసులు వీడియో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

దీన్ని టీడీపీ వాళ్లు షేర్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ వాళ్ల ఆగడాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా హైదరాబాద్‌కి కూడా పాకాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

Published at : 30 Jun 2023 12:39 PM (IST) Tags: Hyderabad Telangana Viral Video Mla Anil Kumar yadav Attack on Apartment Security

ఇవి కూడా చూడండి

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

Voter Sahaya Mithra: తెలంగాణ ఓటర్ల కోసం చాట్ బాట్, అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల సంఘం

Voter Sahaya Mithra: తెలంగాణ ఓటర్ల కోసం చాట్ బాట్, అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల సంఘం

Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్‌ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్

Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్‌ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్

Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్​రెడ్డి ఎద్దేవా

Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్​రెడ్డి ఎద్దేవా

Rainbow Hospitals: గుండె లోపాలు జయించిన చిన్నారులతో రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ హార్ట్ డే వేడుకలు

Rainbow Hospitals: గుండె లోపాలు జయించిన చిన్నారులతో రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ హార్ట్ డే వేడుకలు

టాప్ స్టోరీస్

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?