Hyderabad Kite Festival: పీపుల్స్ ప్లాజాలో ఘనంగా కైట్ ఫెస్టివల్ - పతంగి ఎగురవేసిన మంత్రి తలసాని
Hyderabad Kite Festival: రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ లో పాల్గొని పతంగి ఎగుర వేశారు.
Hyderabad Kite Festival: హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే చిన్నారులకు పతంగులను పంపిణీ చేశారు. అనంతరం అందరితో కలిసి మంత్రి తలసాని పతంగి ఎగుర వేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జనవరి కొత్త సంవత్సరంలో ముందు వచ్చేది సంక్రాంతని అని చెప్పారు. సంక్రాంతి అంటే పాడి పంటలతో రైతన్న సంతోషంగా ఉండే సమయమని ఆయన వివరించారు. ప్రజలంతా మూడు రోజుల పాటు ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని స్పష్టం చేశారు. సంక్రాంతి అంటే ఆడపడుచులు రంగు రంగుల ముగ్గుల వేసి.. గొబ్బెమ్మలు పెడతూ హాయిగా గడుపుతారని తెలిపారు. అలాగే అబ్బాయిలి పతంగులు ఎగుర వేస్తూ.. సంతోషంగా ఉంటారని వెల్లడించారు.
సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా నెక్లెస్ రోడ్ (PV మార్గ్) లోని పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడం జరిగింది. pic.twitter.com/gfoQiqwOVN
— Talasani Srinivas Yadav (@YadavTalasani) January 14, 2023
రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చిన్నప్పుడు అందరం కలిసి పండుగ జరుపుకునే వాళ్లమని.. కానీ ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ వచ్చేసిందని అన్నారు. మన కల్క్చర్ నీ పిల్లలకి తెలిసేలా చేయాలని తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు. పండగ వచ్చినా ఆ సందడి కనిపించడం లేదని ఆవేదన వ్కక్తం చేశారు. ఏపీలో పతంగులు కూడా పెద్దగా ఎంకరేజ్ చేయరని చెప్పుకొచ్చారు. పతంగుల పండగని రెండు రోజుల పాటు జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. మన పండగలను కొనసాగించే పరంపర కొనసాగాలని మంత్రి తలసాని వివరించారు.
రాష్ట్ర ప్రజలందరికి..భోగి పండుగ శుభాకాంక్షలు. pic.twitter.com/ieMBwqePBx
— Talasani Srinivas Yadav (@YadavTalasani) January 14, 2023
— Talasani Srinivas Yadav (@YadavTalasani) January 14, 2023
సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు..
తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగగా మారిన రోజే.. భారత దేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర, దేశ ప్రజలంతా సుఖ సంతోషాల నడుమ హాయిగా పండుగ జరుపుకోవాలని సూచించారు. పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి పండుగని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని సీఎం వివరించారు. నేడు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పునురుజ్జీవింప చేసేందుకు చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంట పొలాలు, ధాన్యపు రాశులు, పాడి పశువులు, కమ్మని మట్టి వాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి మార్గ దర్శకంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు.