By: ABP Desam | Updated at : 09 Jul 2023 10:34 AM (IST)
తొలిబోనం సమర్పిస్తున్న మంత్రి తలసాని
ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి బోనం సమర్పించారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి నేడు (జూలై 9) వేకువజామున 3.30 గంటలకే ఆలయానికి చేరుకుని, కుటుంబ సమేతంగా బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కుటుంబానికి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని మంత్రి, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. నేడు, ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆదమయ్య నగర్ కమాన్ వద్ద పూజల్లో పాల్గొంటారు.
మరిన్ని ఫోటోల కోసం క్లిక్ చేయండి
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. 2014 నుండి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని, బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలి అనే ఉద్దేశంతోనే దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తలసాని అన్నారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తలసాని అన్నారు.
తెల్లవారుజాము నుంచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు వరుస కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో జనాలు వస్తుండడంతో రద్దీ నెలకొనకుండా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బాటా చౌరస్తా నుంచి ఆలయానికి వచ్చే లైను, ఎంజీ రోడ్డు రాంగోపాల్ పేట్ పాత పోలీస్ స్టేషన్ కొత్త ఆర్చి గేట్ నుంచి మహంకాళి పోలీస్ స్టేషన్ మీదుగా ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.
సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ అంజలి టాకీస్ వైపు నుంచి వీఐపీలకు ఒకటి, సాధారణ భక్తులకు మరొకటి చొప్పున క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్ పేట్ పీఎస్ నుంచి సాధారణ భక్తుల క్యూ లైన్ ఉంటుంది. డోనర్ పాస్‌ల కోసం ఎంజీ రోడ్డులో ఆలయం వెనక వైపు నుంచి మరో క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ ఎదురు నుంచి వీవీఐపీలకు అమ్మవారి ఆర్చి గేట్ ద్వారా అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.
ఇటు ఆర్టీసీ కూడా ఉజ్జయిని మహాంకాళి బోనాల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతూ ఉంది. భక్తుల సౌకర్యం కోసం నగరంలో దాదాపు 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్ లో దాదాపు 19 ప్రాంతాల నుంచి బోనాలు జరిగే ప్రాంతాలకు భక్తులు చేరుకునేలా సిటీ బస్సులను తిప్పడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. బోనాల జాతరకు హాజరయ్యే భక్తులు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది.
BRS News: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎంపీ
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు
PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ
Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!
Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!
/body>