TRS Plenary: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుడు టీఆర్ఎస్ ప్లీనరీలో, లీడర్లతో తెగ సెల్ఫీలు
హైదరాబాద్ మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ (హెచ్ఐసీసీ) లో టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు బుధవారం జరిగిన సంగతి తెలిసిందే.
Minister Srinivas Goud Murder Plan Accused Appears In TRS Plenary: తెలంగాణలో అబ్కారీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారనే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి టీఆర్ఎస్ ప్లీనరీలో హల్ చల్ చేశాడు. ఆ కేసులో నింద ఎదుర్కొంటున్న మున్నూరు రవి టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరు కావడమే కాకుండా, పార్టీ కీలక నేతలతో కలిసి సెల్ఫీలు దిగాడు. సీఎం కేసీఆర్ ప్రసంగించిన సమయంలో కూడా మున్నూరు రవి సభా ప్రాంగణంలోనే ఉన్నాడు. మంత్రి హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఏకంగా ప్లీనరీకి హాజరు కావడం సంచలనంగా మారింది
హైదరాబాద్ మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ (హెచ్ఐసీసీ) లో టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్లీనరీ సమావేశాలకు మహబూబ్ నగర్‌కి చెందిన మున్నూరు రవి హాజరయ్యాడు. టీఆర్ఎస్ ప్లీనరీకి కీలక నేతలను మాత్రమే ఆహ్వానించారు. కేవలం మూడు వేల మందికి మాత్రమే ఎంట్రీ పాసులు ఇచ్చారు. అయితే మున్నూరు రవి ఇతరుల పాస్‌పై అక్కడికి వచ్చాడా, లేక అతనికి కూడా ఎంట్రీ పాస్ దక్కిందా? అనే చర్చ జరుగుతోంది. పార్టీ ఐడెంటిటీ కార్డుతోనే రవి ప్లీనరీకి వచ్చాడనే ప్రచారమూ జరుగుతోంది.
మహేందర్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కౌంటర్, ఈసారి టికెట్ తనకేనని విశ్వాసం
అయితే, టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ కార్యకర్తగా ప్లీనరీకి హాజరయ్యానని చెప్పినట్లు తెలుస్తోంది. అంతకుమించి తానేమీ మాట్లాడలేనని చెప్పాడు. శ్రీనివాస్ గౌడ్ తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, గతంలో రాఘవేంద్ర రాజ్ కుటుంబం ఆరోపించింది. ఆర్థికంగా దెబ్బతినడంతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరెస్టు వెనుక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారని రాఘవేందర్ రాజు సోదరులు భావించారు. అందుకే, శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. రాఘవేందర్ రాజు కుటుంబానికి ఉన్న ఆధార్ సెంటర్‌తో పాటు బార్‌ను నడపకుండా చేయడంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలకంగా వ్యవహరించినట్టుగా అనుమానించారు. అటు ఆర్మీలో పనిచేసిన తన తండ్రికి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్డుకొన్నారని, హత్యకు కుట్ర కేసులో ప్రధాన నిందితుడు మున్నూరు రవి ఆరోపించారు. ఆ కేసు విచారణ జరుగుతుండగానే, రవి ప్లీనరీలో కనిపించడం సంచలనంగా మారింది.