By: ABP Desam | Updated at : 16 Jun 2022 11:18 AM (IST)
కేటీఆర్, మోదీ (ఫైల్ ఫోటోలు)
ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి ప్రభుత్వ సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేయడం సాధారణమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, శ్రీలంక విండ్ పవర్ (పవన విద్యుత్) కాంట్రాక్టుల్లో ప్రధాని మోదీ జోక్యం ఉందని ఆ దేశ సీనియర్ అధికారులే ఆరోపిస్తున్నారని అన్నారు. మరి దీనిపై ప్రధాని మోదీ, అదానీ ఎందుకు స్పందించడం లేదని మంత్రి కేటీఆర్ నిలదీశారు. శ్రీలంక పోర్ట్స్ అథారిటీ సూపర్ వైజర్ కలుతరాగే మాట్లాడిన ఓ వీడియోను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Opposition leaders all over India are routinely targeted & subjected to grilling by ED, CBI & IT
— KTR (@KTRTRS) June 16, 2022
But when senior Sri Lankan Govt officials directly accuse the PM of India & his involvement in wind power contracts
Neither Pradhani Nor Adani respond! Deafening silence from media!
From promising 2 crore jobs a year; Modi now promises 1.5 Lakh jobs a year!
He brings the Agniveer scam in the Army where army recruits will be retired in 4 years!
But all ports, airports, power plants etc in India&Lanka to Adani!
Revolutionary! New India!
Modi hai to mumkin hai pic.twitter.com/SAeIhOV6pW— Prashant Bhushan (@pbhushan1) June 16, 2022
యాక్టివిస్ట్ ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నుంచి ఏడాదికి 1.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే స్థాయికి వచ్చారు. తాజాగా ఆయన ఆర్మీలో అగ్నివీర్ పేరుతో ఒక స్కామ్ ను ప్రకటించారు. ఇక్కడ సైన్యంలోకి రిక్రూట్ చేసుకొనే సైనికులు నాలుగేళ్లకే రిటైర్ అవుతారు. కానీ, భారత్, శ్రీలంకలోని పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పవర్ ప్లాంట్స్ లాంటివన్నీ అదానీకి కట్టబెడుతున్నారు. ఇది నిజంగా న్యూ ఇండియా’’ అని ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
The chairman of Sri Lanka’s state-owned Ceylon Electricity Board accused Modi of pressuring Sri Lankan govt over the allotment of a wind power project to the Adani group.
— Prashant Bhushan (@pbhushan1) June 16, 2022
But our business press hardly carried this news. Godi-fication of pink press is totalhttps://t.co/rdLzOiguqf
‘‘శ్రీలంకలో విండ్ పవర్ ప్రాజెక్టును ఆదానీ గ్రూపునకు కేటాయించేలా మోదీ, శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లుగా, ఆ దేశ ప్రభుత్వ సంస్థ అయిన Ceylon Electricity Board అధికారులు ఆరోపణలు చేశారు. కానీ, మన దేశంలోని బిజినెస్ ప్రెస్ ఈ వార్తలను కవర్ చేయలేదు.’’ అని ప్రశాంత్ భూషణ్ మరో ట్వీట్ చేయగా, దీన్ని కేటీఆర్ రీట్వీట్ చేశారు.
TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Hyderabad News: ఒంటెలను వధించి మాంసం విక్రయం - ముగ్గురు నిందితుల అరెస్ట్
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
CLP Meeting News: సీఎల్పీ లీడర్ ఎంపిక బాధ్యత అధిష్ఠానానికే, కాసేపట్లో సీఎం పేరుపై ప్రకటన వచ్చే ఛాన్స్!
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
/body>