Lulu Group Investment: తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చిన లులూ సంస్థ - రూ.3500 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు
Lulu Group Investment: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు లులూ సంస్థ ముందుకొచ్చింది. రూ.3500 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
Lulu Group Investment: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈకి చెందిన లులూ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో లులూ గ్రూప్ తమ పెట్టుబడుల కార్యాచరణను ప్రకటించారు. ఇప్పటికే రూ.300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో షాపింగ్ మాల్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చేసుకున్న ఒప్పందం మేరకు తెలంగాణలో లలూ గ్రూప్ పనులు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
Industries Minister @KTRBRS welcomed the announcement of Lulu Group International's commencement of operations in Telangana.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 26, 2023
The company, based in the UAE and led by Chairman and Managing Director @Yusuffali_MA, has declared an impressive investment of Rs. 3,500 crores in the… pic.twitter.com/yGPSojSozh
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పాటు దారుల్లో ఒకటైన లులూ గ్రూప్ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు తెలంగాణలో పెడుతున్న పెట్టుబడులు.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని వివరించారు. అలాగే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. లులూ సంస్థ పెట్టుబడులతో తెలంగాణ టూరిజం పెరుగుతుందని భావిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Starting the week with good news
— KTR (@KTRBRS) June 26, 2023
Many thanks to Sri @Yusuffali_MA Ji the Chairman and MD of @LuLuGroup_India for committing to ₹3,500 Crore investment in Telangana State
These investments will be in Food processing and retail sectors pic.twitter.com/ARTXRQaGPZ