KTR: హైదరాబాద్‌లో మరో 1,300 స్వచ్ఛ వాహనాలు.. జెండా ఊపి ప్రారంభించిన కేటీఆర్

హైద‌రాబాద్‌లో సోమవారం (డిసెంబరు 13) మరో మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి స్వచ్ఛ ఆటోల‌ను మంత్రి కేటీఆర్ ప‌చ్చ జెండా ఊపి ప్రారంభించారు.

FOLLOW US: 

గత ఐదారు సంవత్సరాల నుంచి కేంద్రం ప్రక‌టిస్తూ వస్తున్న స్వచ్ఛ భార‌త్, స్వచ్ఛ స‌ర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో హైద‌రాబాద్ నగరంలో తొలి స్థానంలో నిలుస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రతి చోటా హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైద‌రాబాద్‌లో సోమవారం (డిసెంబరు 13) మరో మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి స్వచ్ఛ ఆటోల‌ను మంత్రి కేటీఆర్ ప‌చ్చ జెండా ఊపి ప్రారంభించారు. 

హైద‌రాబాద్ న‌గ‌ర ప్రజ‌ల‌కు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నామ‌ని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. ‘‘సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వచ్ఛ హైద‌రాబాద్ కార్యక్రమం ప్రారంభించాం. హైదరాబాద్‌ను ప‌రిశుభ్రంగా ఉంచేందుకు నాడు కేసీఆరే స్వయంగా 2500 స్వచ్ఛ ఆటోల‌ను ప్రారంభించి ఉన్నారు. స్వచ్ఛ హైద‌రాబాద్ – స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం చేపట్టారు. గ‌తంలో స‌ఫాయి అన్న.. నీకు స‌లాం అన్న.. అని మొట్టమొద‌టిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆ మాట‌తోనే స‌రిపెట్టకుండా, స‌ఫాయి కార్మికులు అడ‌గ‌క‌ముందే మూడు సార్లు జీతాలు కూడా పెంచార‌ు. న‌గ‌రంలో 2,500 ఆటో టిప్పర్లు ప్రవేశ‌పెట్టక‌ముందు 3,500 మెట్రిక్ ట‌న్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. ఈ ఆటో టిప్పర్లు ఇంటింటికీ తిరిగి చెత్త సేక‌రించ‌డం వ‌ల్ల.. 6,500 మెట్రిక్ ట‌న్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. మొత్తంగా చెత్తను డంప్ యార్డుల‌కు త‌ర‌లిస్తున్నారు.’’ అని కేటీఆర్ తెలిపారు.

‘‘ఇవాళ ప్రారంభించుకున్న 1,350 కొత్త స్వచ్ఛ వాహ‌నాల‌తో క‌లిపితే 5,750 కి పైగా వాహ‌నాలు జీహెచ్ఎంసీలో అందుబాటులో ఉన్నాయి. న‌గ‌ర ప్రజ‌ల‌కు మేం మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నాం. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అతి పెద్దదైన ‘వేస్ట్ టు ఎన‌ర్జీ’ ప్లాంట్‌ను జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్‌లో 20 మెగావాట్ల సామ‌ర్థ్యంతో ప్రారంభించుకున్నాం. మ‌రో 28 మెగా వాట్ల ప్లాంట్‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు కూడా ల‌భించాయి. ఈ ప్లాంట్ నిర్మాణ ప‌నులు త్వర‌లోనే ప్రారంభిస్తాం. చెత్త నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత‌గా ముందుకు రావాలి’’ అని మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు.

Also Read: Bandi Sanjay: వాళ్లని ఇబ్బందులు పెట్టి కేసీఆర్ రాజకీయ పబ్బం.. అది పెను ప్రమాదం: బండి సంజయ్

Also Read: Dharmapuri Arvind: బీజేపీ అధిష్ఠానం దృష్టి పడింది.. కొద్ది రోజుల్లో TSలో మరిన్ని సంచలనాలు: ధర్మపురి అర్వింద్

Also Read:  ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Dec 2021 12:41 PM (IST) Tags: KTR Talasani Srinivas Yadav GHMC News Swachh Auto Tippers mahamood li Mayor gadwal Vijaya lakshmi

సంబంధిత కథనాలు

TSRTC News: ఫలించిన సజ్జనార్ వ్యూహాలు - క్రమంగా గట్టెక్కుతున్న టీఎస్ఆర్టీసీ! ఈసారి భారీగా తగ్గిన నష్టం

TSRTC News: ఫలించిన సజ్జనార్ వ్యూహాలు - క్రమంగా గట్టెక్కుతున్న టీఎస్ఆర్టీసీ! ఈసారి భారీగా తగ్గిన నష్టం

Telangana Covid Cases: తెలంగాణలో మరింత పెరిగిన కరోనా, 3 వేలు దాటిన యాక్టివ్ కేసులు - 500కి చేరువలో కొత్తవి

Telangana Covid Cases: తెలంగాణలో మరింత పెరిగిన కరోనా, 3 వేలు దాటిన యాక్టివ్ కేసులు - 500కి చేరువలో కొత్తవి

Thunderstorm Safety Tips: వానాకాలం మొదలైంది, ప్రాణాలు పోతున్నాయి - పిడుగుపాటుకు గురికాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

Thunderstorm Safety Tips: వానాకాలం మొదలైంది, ప్రాణాలు పోతున్నాయి - పిడుగుపాటుకు గురికాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం, పరుగులు తీసిన సిబ్బంది, మెడికల్ స్టూడెంట్స్!

Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం, పరుగులు తీసిన సిబ్బంది, మెడికల్ స్టూడెంట్స్!

Weather Updates: నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడతాయని హెచ్చరిక - తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడతాయని హెచ్చరిక - తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ

టాప్ స్టోరీస్

PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన

PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?  ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

70 years For Devadasu: అలనాటి క్లాసిక్ 'దేవదాసు'కు డెబ్భై ఏళ్ళు

70 years For Devadasu: అలనాటి క్లాసిక్ 'దేవదాసు'కు డెబ్భై ఏళ్ళు