Bandi Sanjay: వాళ్లని ఇబ్బందులు పెట్టి కేసీఆర్ రాజకీయ పబ్బం.. అది పెను ప్రమాదం: బండి సంజయ్
పాత సమస్యను దారి మళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరపైకి తెస్తూ కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటుండడం అలవాటుగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం బండి ప్రకటన విడుదల చేశారు.
జోనల్ విధానం తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ప్రమోషన్లు దక్కక ఇబ్బంది పడుతున్నారని, అలాంటివారిని మరింతగా కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. పాత సమస్యను దారి మళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరపైకి తెస్తూ కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటుండడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఈ మేరకు సోమవారం బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడింది. ముఖ్యమంత్రి తుగ్లకు పాలనకు ఇది నిదర్శనం. స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తీసుకొస్తూ రాజకీయ లబ్ది పొందే కుట్ర చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్లు దక్కక, ఇతరత్రా సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులను మరింత ఇబ్బంది పెట్టేలా సీఎం వ్యవహరిస్తున్నారు. పాత సమస్యను దారిమళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరమీదకు తెస్తూ రాజకీయ పబ్బం గడపుకోవడం సీఎంకు అలవాటుగా మారింది.’’
‘‘ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలను కమీషన్లుగా దండుకున్న సీఎం ఆ డబ్బుతోపాటు ఉద్యోగుల సమస్యలనూ దాచిపెడుతూ... తనకు అవసరమైనప్పుడు మాత్రమే వాటిని బయటకు తీస్తూ రాజకీయ డ్రామాలాడుతూ గందరగోళం రేపుతున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం రేపుతున్న ఈ జీవో అమలును తక్షణమే నిలిపివేయాలి. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న తరువాతే జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరపాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల స్పూర్తిని దెబ్బతీయకుండా నిర్ణయం తీసుకోవాలి.
మాకో అవకాశం ఇవ్వండి: బండి సంజయ్
కరీంనగర్‌లో మూడు రోజులపాటు జరిగిన బీజేపీ జిల్లా శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో ఆదివారం బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పనైపోయిందని, అసలు సిసలైన ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని అన్నారు. బీజేపీ సిద్దాంతాలు లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంత్రుత్వం, కుటుంబ పాలనను క్షేత్ర స్థాయిలో ఎండగట్టేందుకు అనుసరించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలతో అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడింది. ముఖ్యమంత్రి తుగ్లక్ పాలనకు ఇది నిదర్శనం. స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 13, 2021
పాత సమస్యను దారిమళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరమీదకు తెస్తూ రాజకీయ పబ్బం గడపుకోవడం సీఎంకు అలవాటుగా మారింది. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలను కమీషన్లుగా దండుకున్న సీఎం ఆ డబ్బుతోపాటు ఉద్యోగుల సమస్యలపై రాజకీయ డ్రామాలాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 13, 2021
ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న ఈ జీవో అమలును తక్షణమే నిలిపివేయాలి. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న తరువాతే జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరపాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి దెబ్బతీయకుండా నిర్ణయం తీసుకోవాలి.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 13, 2021
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి