అన్వేషించండి

KTR Comments On Modi : ప్రధానమంత్రుల్లోకెల్లా మోదీ అత్యంత బలహీనం- కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

KTR Pressmeet: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కేటీఆర్ శుక్రవారం కలిశారు. తెలంగాణ అభివృద్ధి సహకరించాలని కోరినట్లు తెలిపారు. 

KTR Comments On Modi : రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న పలు అంశాల పరిష్కారం దిశగా తెలంగాణ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీలీ దిల్లీలో పర్యటిస్తున్నారు. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తో సమావేశమై.. పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. 

'ప్రజారవాణా కోసం అడుగుతున్నాం, కేంద్ర సహకరించాలి'

రాజీవ్ రహదారిపై స్కైవేల నిర్మాణానికి కేంద్ర భూములు ఇవ్వాలని, వాటికి సమానమైన భూమిని మరో చోట కేటాయిస్తామని రాజ్‌నాథ్‌ సింగ్ తో చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. రక్షణ శాఖ భూములు ఉన్న చోట అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందన్న కేటీఆర్.. కంటోన్మెంట్ లీజ్ భూములను జీహెచ్ఎంసీకి బదలాయించాలని కోరినట్లు ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. కేంద్రం సంబంధిత భూములు రాష్ట్రానికి అప్పగిస్తే.. ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని తెలిపారు. కంటోన్మెంట్ భూములు ఇవ్వాలని 9 ఏళ్లుగా కోరుతూనే ఉన్నామని, అయినా కేంద్ర సర్కారు ఒప్పుకోవడం లేదని చెప్పారు. మెట్రో రైలు విస్తరణకూ కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చామని, ఎంఎంటీఎస్‌ విస్తరణకూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. ప్రజా రవాణా కోసం భూములు అడుగుతున్నామని కేంద్రం సహకరించారని కోరారు. 

'కేంద్రం సహకరించకుంటే ప్రజల్లో ఎండగడతాం'

లఖ్ నవూ, అహ్మదాబాద్ లో కంటోన్మెంట్ భూములను మెట్రో కోసం ఇచ్చారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టులో కూడా కేంద్ర వాటా నిధులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్న కేటీఆర్.. కొత్తగా 31 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. మెట్రో ఫేజ్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. సహకరించకుంటే కేంద్ర వైఖరిని ప్రజల్లో ఎండగడతామని కేటీఆర్ అన్నారు. అహ్మదాబాద్ లో వరదలు వస్తే భారీగా నిధులు కేటాయించారని గుర్తు చేసిన కేటీఆర్.. వరదలతో హైదరాబాద్ నష్టపోతే ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పోతే.. రాష్ట్రానికి కేంద్రం 40 పైసలు మాత్రమే ఇస్తోందని అన్నారు. రాష్ట్రానికి అప్పుగా ఇచ్చిన వాటిని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

'అత్యంత బలహీన ప్రధాని'

దేశ సమస్యలను కాంగ్రెస్, బీజేపీలు పరిష్కరించలేకపోతున్నాయని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్ర వచ్చి 75ఏళ్లు గడుస్తున్నా.. చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా అలాగే ఉన్నాయని అన్నారు. దేశంలో ఇప్పటికీ తాగునీరు, కరెంటు లేని గ్రామాల్లో వేలల్లో ఉన్నాయని దుయ్యబట్టారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయన్న కేటీఆర్.. ఎవరు ఎవరికి బీ టీమ్, ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో ప్రజలకు బాగా తెలుసుని విమర్శించారు. ఇప్పటి వరకు దేశానికి పని చేసిన ప్రధాన మంత్రుల్లో మోదీయే అత్యంత బలహీన ప్రధాని అని తీవ్రస్థాయిలో విమర్శించారు. వృద్ధి రేటు, చమురు, గ్యాస్ ధరలు, ద్రవ్యోల్బణం ఎలా ఉందో అందరికీ తెలుసని అన్నారు. ఈ క్రమంలోనే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన నిర్ణయాలను కచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. కేంద్రంలో చక్రం తిప్పడానికి దిల్లీలోనే ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. తమ రాజకీయాలు హైదరాబాద్ కేంద్రంగానే సాగుతాయని స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget