News
News
X

Medchal News: అక్రమంగా విదేశీ మద్యం విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు - ఐదుగురి అరెస్ట్, పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం

Medchal News: మేడ్చల్ ఎక్సైజ్ శాఖ పరిధిలో విదేశీ మద్యం విక్రయిస్తు్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నలుగురు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

Medchal News: మేడ్చల్ ఎక్సైజ్ శాఖ పరిధిలో విదేశీ మద్యం విక్రస్తున్న ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేస్తున్నారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి 12 లక్షలకు పైగా విలువ చేసే 233 విదేశీ మద్యం సీసాలు, 80 వేల రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

అసలేం జరిగిందంటే..?

మేడ్చల్ జిల్లాలో తొమ్మిది మంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి విదేశీ మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారు. అయితే విషయం గుర్తించిన ఎక్సైజ్ శాఖ, టాస్క్ ఫోర్స్ పోలీసులు మద్యం దుకాణంపై దాడి చేశారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 12 లక్షల 57 వేల 940 రూపాయల విలువ చేసే 233 విదేశీ మద్యం సీసాలు, 80 వేల రూపాయల నగదు, 5 సెల్ ‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో నలుగురు వ్యక్తులు తప్పించుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ అన్నారు. పట్టుబడిన వారిలో మహిపాల్ రెడ్డి, రాము, కృష్ణ కిరణ్, రాజారాం సింగ్, గుడ్డు బాయ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  ఫంక్షన్లలో ఉపయోగించేందుకు ఇతర రాష్ట్రాల నుండి అనుమతులు లేకుండా మద్యం తెప్పించి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జరిగే ఫంక్షన్లకు తరలించే వారని తెలిపారు. మేడ్చల్ ఎక్సైజ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దేవరంజల్ లోని జెన్వి కన్వెన్షన్ హాల్ లో తనిఖీలు నిర్వహించగా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నెలరోజుల క్రితం మహబూబాబాద్ లో వైన్ షాప్ సీజ్

కల్తీ మద్యం విక్రయించి ప్రజల ప్రాణాల మీదకి తెస్తున్నారు. ఇదివరకే పలు చోట్ల కల్తీ మద్యం సేవించి తరచుగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనల గురించి వింటుంటాం. కల్తీ మద్యం విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమై వైన్ షాప్ సీజ్ చేశారు. అలాగే మరోసారి కల్తీ మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. 

11 హాఫ్ బాటిల్లు, 24 ఐబీ క్వార్టర్లు.. వైన్ షాప్ ను సీజ్ చేసిన పోలీసులు

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో కల్తీ మద్యం విక్రయిస్తున్న వైన్ షాప్ ను తొర్రూరు ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తోర్రూర్ పట్టణంలోని అమ్మాపురం రోడ్ లో ఉన్న శ్రీనివాస్ వైన్ షాప్ లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పక్కా సమాచారం రావడంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు  బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో 11 హాఫ్ బాటిల్లు, 24 ఐబి క్వార్టర్లు, మరికొన్ని బాటిల్స్ ఎక్సైజ్ అధికారులకు లభ్యం అయ్యాయి. ఎక్సైజ్ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శ్రీనివాస వైన్స్ ను సీజ్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. కల్తీ మద్యం విక్రయించడం మాత్రమే కాదు, ఎక్సైజ్ శాఖ నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలను మించి అధిక ధరలకు మద్యం విక్రయించినా చర్యలు తప్పవని వైన్ షాప్ నిర్వాహకులను హెచ్చరించారు. ఈ తనిఖీలో టాస్క్ ఫోర్స్ అధికారి చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు. 

Published at : 06 Mar 2023 04:35 PM (IST) Tags: Telangana News Hyderabad Crime News Medchal News Excise Hyderabad Police Illeagal Foreign liquor

సంబంధిత కథనాలు

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Revanth Reddy : సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 1 టాప్ స్కోరర్స్ జాబితాతో విచారణకు రేవంత్ రెడ్డి!

Revanth Reddy : సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 1 టాప్ స్కోరర్స్ జాబితాతో విచారణకు రేవంత్ రెడ్డి!

TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!

TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!

వివేక హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్- విచారణ 29కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

వివేక హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్- విచారణ 29కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!

Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్