By: ABP Desam | Updated at : 04 Apr 2023 10:46 AM (IST)
Edited By: jyothi
ప్రతీకాత్మక చిత్రం
Margadarshi Case: మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఆ సంస్థ ఛైర్మన్ రామోజీరావును ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ డబ్బులు చీటీ పాడుకున్నాక ఆ మెత్తం వినియోగదారుడికి ఇవ్వకుండా తమ సంస్థల్లోనే డిపాజిట్ చేయించారనే అభియోగాలపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద రామోజీరావుతో పాటు ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు ఏపీ సీఐడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. విచారణకు అనుకూలంగా ఉన్న నాలుగు తేదీలు చెప్పాలని వాటిలో పేర్కొనగా.. ఏప్రిల్ 3వ తేదీన తాను అందుబాటులో ఉంటానని రామోజీరావు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్, లీగల్ అడ్వైజర్ తో పాటు ఇతర అధికారుల బృందం హైదరాబాద్ కు చేరుకుంది. ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, మహిళా అధికారులు సహా సుమారు 20 మంది బృందం ఆరు కార్లలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని రామోజీరావు నివాసానికి సోమవారం ఉదయమే చేరుకొని సాయంత్రం వరకు ప్రశ్నించింది.
మొత్తం 46 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం..
అలాగే నలుగురు కెమెరా మెన్ లతో మొత్తం విచారణను రికార్డు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావును వైద్యుల పర్యవేక్షణలో అధికారులు విచారించారు. ఉదయం 11.30 గంటలకు విచారణను ప్రారంభించారు. గంటసేపు విచారణ చేపట్టగానే.. రామోజీరావు అలసిపోయినట్లు కనిపించగా గంటసేపు విరామం ఇచ్చారు. వైద్యులు పరీక్షించిన తర్వాత మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ ఆరభించారు. సాయంత్రం 5.30 గంటలకు విచారణను పూర్తి చేశారు. 7.30 వరకు అక్కడే ఉన్నారు.
అయితే మొత్తం 46 ప్రశ్నలు అడగగా... రామోజీరావు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిట్ ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలోకి మళ్లించడంపై వివరిస్తారా అని రామోజీరావును ప్రశ్నించగా.. మార్గదర్శిపై ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. లక్షల మంది చందాదారులు, డిపాజిటర్ల నమ్మకం చూరగొన్న సంస్థలో ఎలాంటి తప్పులకు తాము ఆస్కారం ఇవ్వబోమని రామోజీరావు స్పష్టం చేసినట్లు తెలిసింది. గతంలో తమ సంస్థపై ఆరోపణలు వచ్చినప్పుడు సైతం డిపాజిటర్లు ఎక్కడా రూపాయి నష్టపోలేదని, ఇప్పుడూ వారి సొమ్ము కన్నా ఎక్కువ ఆస్తి తమ వద్ద ఉందని బదులు ఇచ్చినట్లు సమాచారం.
ఆరో తేదీన శైలజా కిరణ్ ను విచారించనున్న సీఐడీ..
చందాదారుల అనుమతితో సంతకం తీసుకున్న తర్వాతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేశామని, ఎక్కడా ఏదీ దాచుకోలేదని వివరించినట్లు తెలిసింది. సోమవారం రామోజీరావును మాత్రమే విచారించామని, సంస్థ ఎండీ శైలజా కిరణ్ ను గురువారం అంటే ఏప్రిల్ ఆరో తేదీన విచారిస్తామని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మార్గదర్శి సంస్థకు చెందిన నలుగురు మేనేజర్ల, ఒక ఆడిటర్ ను ఏపీ సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మార్చి నెల 28వ తేదీ రోజు మార్గదర్శిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుకు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజాకిరణ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ. మార్చి 29, 31 లేదా ఏప్రిల్ 3, 6 తేదీల్లో ఎప్పుడైనా సీఐడీ విచారణకు రావాలని తెలిపారు. విచారణ వాళ్ల నివాసంలో కానీ, ఆఫీస్‌లో కానీ విచారించణకు హాజరుకావాలని ఆదేశించారు.
Jupally Krishna Rao Arrest: కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్, ఉద్రిక్తత
Gang Arrest : ఐటీ అధికారుల పేరుతో బంగారం దోపిడీ - గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు ! ఈ స్కెచ్ మమూలుగా లేదుగా
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్