అన్వేషించండి

Malkajgiri News: నాలాలో కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన - 3 గంటలుగా అందులోనే

Telangana News: జీహెచ్ఎంసీ అధికారులు పనులలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ నాలాలో కూర్చొని మూడు గంటలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన తెలిపారు.

BRS News: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నాలాలో కూర్చొని నిరసన తెలిపారు. మల్కాజిగిరి గౌతమ్ నగర్ డివిజన్‌లో ఆయన ఈ నిరసన ప్రదర్శన చేశారు. గత ఆరు నెలలుగా రోడ్డును తవ్వి కాలనీ వాసులను జీహెచ్ఎంసీ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అధికారులు పనులలో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాలాలో కూర్చొని మూడు గంటలుగా ఎమ్మెల్యే నిరసన తెలిపారు.

ప్రజా సమస్యల కోసం ఎక్కడ సమస్య ఉన్నా తాను నిరంతరం నిరసన తెలుపుతూనే ఉంటానని మర్రి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజా పాలన అందిస్తున్నా అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యపై స్పందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. వర్షాకాలం వస్తున్నప్పటికీ ఇంకా ఏ చర్యలు తీసుకోలేదని.. కాలనీలు నీటిలో మునిగే పరిస్థితి ఉన్నా అధికారుల ఇంకా నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారని మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వెంటనే రహదారి పగలగొట్టిన చోట దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ పనుల పర్యవేక్షణకు వచ్చినా అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

‘‘మల్కాజ్ గిరి నియోజకవర్గం 141 వ డివిజన్ పరిధిలోని పాత మిర్జల్ గుడా పరిసర ప్రాంతాలలో నిన్నటి అకాల వర్షం కారణంగా పలు కాలనీలో తీవ్రంగా దెబ్బతిన్న బాక్స్ డ్రెయిన్ లను స్థానిక కార్పొరేటర్ సునీత రాము యాదవ్ తో కలిసి పరిశీలించాను. జీహెచ్ఎంసీ అధికారులకి ముందస్తుగా నా పర్యటన వివరాలను తెలియచేసినప్పటికీ సెలవులపై వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గతంలో పలు మార్లు మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ప్రతి సమస్యల పరిష్కారం కోసం నా తరుపున Deputy Commissioner Malkajgiri, GHMC నుండి కింది స్థాయి అధికారులు వరకు ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం శూన్యంగా ఉంది.
 
నా ఆధ్వర్యంలో గతంలో ఎన్ని వినతులు ఇచ్చినా అధికార్ల నిర్లిప్తత అలసత్వం తీవ్ర ఆవేదనకి గురి చేస్తుంది. ప్రజలను ఇబ్బందులు పెట్టడమే ప్రజాపరిపాలనా? అని సీఎంవోను ప్రశ్నిస్తున్నాను. ఉదయం నుంచి జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు నాకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. దీనిపై ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను. దీనిపై అధికార్లు చర్యలపై ఉపక్రమించకపోతే ఈ నిరసనను ఉధృతం చేస్తామని తెలియచేస్తున్నాను’’ అని మర్రి రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget