Hyderabad Airport: హైదరాబాద్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం, వారంలో 5 రోజులు సేవలు
GMR Hyderabad International Airport: హైదరాబాద్ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫ్రాంక్ఫర్ట్ కు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభించింది.
Lufthansa Launches Direct Flights from Hyderabad to Frankfurt: హైదరాబాద్: శంషాబాద్ (జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్‌కు కొత్త విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ భాగస్వామ్యంతో డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభించారు. జనవరి 17న ప్రారంభమైన ఈ విమాన సర్వీస్ హైదరాబాద్‌ను ప్రపంచంతో అనుసంధానించడానికి ప్రయాణం, వాణిజ్యానికి గ్లోబల్ హబ్ గా మార్చడానికి మరో అడుగు పడింది.
వారానికి ఐదు రోజులు విమాన సర్వీసులు
వారానికి ఐదు (సోమ, మంగళ, బుధ, గురు, శనివారాలు) LH 753 విమానం హైదరాబాద్ నుంచి 01:55 గంటలకు బయలుదేరి 07:05 గంటలకు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరానికి చేరుకుంటుంది. ఫ్రాంక్ఫర్ట్ నుంచి విమానం LH 752 ఉదయం 10:55 గంటలకు బయలుదేరి రాత్రి 11:55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇటీవల కాలంలో భారత్ నుంచి ఉత్తర అమెరికాకు నలభై శాతం మంది ప్రయాణికులు యూరోప్ లో విమానాశ్రయాలను రవాణా కేంద్రాలుగా ఎంచుకుంటున్నారు. లుఫ్తాన్సా విమానాల సౌకర్యవంతమైన జర్నీ వీరికి సరిపోతుంది, కనెక్టివిటీ సైతం పెరుగుతుంది. డ్రీమ్ లైనర్ యొక్క నిశ్శబ్ద క్యాబిన్ తగినంత స్థలం, కొత్త లైటింగ్ కాన్సెప్ట్ అండ్ సృజనాత్మక కిటికీలతో మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. డ్రీమ్ లైనర్ లోని ప్రయాణికులు మునుపెన్నడూ లేని విధంగా మెరుగైన ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ సీఈఓ హర్షం..
లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ తో ఫ్రాంక్ఫర్ట్ కు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించడంపై జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పణికర్ హర్షం వ్యక్తం చేశారు. “ ఈ కనెక్టివిటీ ఫ్రాంక్ఫర్ట్ను ట్రాన్సిట్ పాయింట్గా లేదా విశ్రాంతి ప్రయాణాల కోసం సందర్శించే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. దాంతోపాటు ఫ్రాంక్ఫర్ట్ ద్వారా ఐరోపా, యుఎస్ఎ, కెనడాతో పాటు దక్షిణ అమెరికాలోని చాలా గమ్యస్థానాలను గేట్ వే గా మారుతుందన్నారు. తమ ప్రయాణికులను హైదరాబాద్ నుండి ప్రపంచ గమ్యస్థానాలకు అనుసంధానించడం మా ప్రాధాన్యత అన్నారు. ఆ దిశగా ఇది ఒక ముందడుగు అని, హైదరాబాద్ విమానాశ్రయానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు.
తమ కొత్త హైదరాబాద్- ఫ్రాంక్ఫర్ట్ సర్వీసుతో భారత ప్రయాణికులకు ఐరోపాలోని ప్రధాన నగరాలకు, ఖండంలోని అతిపెద్ద నెట్వర్క్ కనెక్షన్లను అందిస్తున్నామని లుఫ్తాన్సా గ్రూప్ దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ జార్జ్ ఎటియిల్ తెలిపారు. హైదరాబాద్ నుంచి తాజా సర్వీసుతో భారతదేశానికి తమ ట్రావెల్ కెపాసిటీ 14% పెరిగింది (2019 తో పోలిస్తే) అన్నారు. లుఫ్తాన్సాకు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన మార్కెట్ గా భారత్ మారిందన్నారు. గత 3 నెలల్లో భారత్ నుంచి ఐరోపాకు 2 కొత్త రూట్లలో సేవల్ని ప్రారంభినట్లు పేర్కొన్నారు.
జనవరి 2023 నుంచి అక్టోబర్ మధ్య హైదరాబాద్ నుంచి యూరప్‌నకు దాదాపు 4,00,000 మంది ప్రయాణించారని, అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 39 శాతం అధికం. ప్రయాణికుల డిమాండ్ పెరగడం ఈ కొత్త సర్వీసుకు కారణమైంది. 2022లో 6,70,000కు పైగా దరఖాస్తుల సమర్పణతో స్కెంజెన్ వీసా దరఖాస్తులలో భారత్ ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది.
బోయింగ్, ఎయిర్ బస్ లాంటి దిగ్గజాలకు నిలయమైన ఏరోస్పేస్, డిఫెన్స్ పవర్ హౌస్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ లో వచ్చే ఐదేళ్లలో ప్యాసింజర్ విమానాల ఉత్పత్తి రెట్టింపు కానుంది. 5 లక్షల మందికి పైగా నైపుణ్యం కలిగిన మేధావులను కలిగి ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలకు భారత టెకీలు సీఈవోగా సేవలు అందిస్తున్నారు. సిలికాన్ ను మించిన హైదరాబాద్ సామర్థ్యం వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా, ఫార్మా, లైఫ్ సైన్సెస్ కు దిక్సూచిగా, అంతర్జాతీయ పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించింది.