News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Lift Accidents: లిఫ్టు ఎక్కాలంటే భయం- నిర్వహణపై ప్రజల్లో ఆందోళన

Lift Accidents: రోజురోజుకూ లిఫ్టు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే లిఫ్టు భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలంతా ఎలివేటర్ల భద్రతపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

FOLLOW US: 
Share:

Lift Accidents: ఈ మధ్య లిఫ్టు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే నోయిడాలో లిఫ్ట్‌ ఫెక్షన్‌ కారణంగా 73 ఏళ్ల వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసినప్పటి నుంచి నగరంలో ఎలివేటర్ల భద్రతపై ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో లిఫ్టు ప్రమాదాలు చాలానే జరిగాయి. జులై 5వ తేదీన ఓ షాపింగ్ మాల్ లిఫ్టులో చాలా గంటలపాటు ఇరుక్కుపోయిన గర్భిణీ స్త్రీతో సహా 12 మందిని సిబ్బంది రక్షించారు. ఏడాది క్రితమే కొంపల్లిలోని ఓ సైట్‌లో పని చేస్తున్న 25 ఏళ్ల టెక్నీషియన్‌ నుజ్జునుజ్జు కాగా.. అంతకు ముందు గ్రిల్‌లో తల కూరుకుపోయి 10 ఏళ్ల బాలుడు దారుణమైన రీతిలో మృతి చెందాడు. మంత్రులు కూడా లిఫ్టులో ఇరుక్కొని ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి 

గత మూడేళ్లలో కనీసం ఒక్కొక్కరూ కనీసం ఐదసార్లు లిఫ్టులో ఇరుక్కుపోయారా..!

సోషల్ ప్లాట్‌ ఫారమ్ లోకల్ సర్కిల్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. హైదరాబాద్‌లో 63 శాతం మంది ప్రజలు గత మూడేళ్లలో కనీసం ఒకటి నుంచి ఐదు సార్లు లిఫ్టులో చిక్కుకున్నట్లు చెప్పుకొచ్చారు. నెలకు కనీసం రెండు సార్లు ఎవరో ఒకరు లిఫ్టులో ఇరుక్కుపోతారని పంజాగుట్టలోని రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కు చెందిన వ్యక్తి తెలిపారు. అయితే అలాంటి సమస్యలు వస్తే మెట్లు ఎక్కి వెళ్లడమో, లేదా వాచ్ మెన్ రిపేర్ చేయడమో చేస్తున్నారని వివరించారు. కానీ నిర్వహణ గురించి తమకు పెద్దగా తెలియదని చెప్పుకొచ్చారు. ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని.. కానీ శాశ్వత పరిష్కారం చూపిస్తే బాగుంటుందని అన్నారు. అలాగే సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తమ లిఫ్ట్‌లను తయారీదారులు లేదా థర్డ్ - పార్టీ కాంట్రాక్టర్‌లు నిర్వహిస్తున్నారని, ఇది భద్రతా ప్రమాణాలలో అసమానతలకు దారితీసిందని తెలుస్తోంది.

"గడువు ముగిసిన వెంటనే ఏఎంసీని సంప్రదించాలి"

తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గులాం మొహియుద్దీన్ ఆదిల్ మాట్లాడుతూ.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. తయారీదారులతో వారి వార్షిక నిర్వహణ ఒప్పందం (AMC) గడువు ముగిసినప్పుడు వినియోగ దారులు తరచుగా మరచిపోతారని చెప్పారు. అలాగే సమస్య తలెత్తినప్పుడు మాత్రమే వారు సమస్యను నివేదిస్తారని అన్నారు. ఏఎంసీ గడువు ముగిసిన వెంటనే, వారు తమ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. లిఫ్ట్ కోసం ఒక సూచన ప్రమాణాలను మూడేళ్ల క్రితమే ప్రభుత్వానికి సమర్పించినా.. నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వివరించారు. 

లిఫ్టుల్లో సంరక్షణ, భద్రతపై చట్టంలో క్లాజులను పొందుపరిచినప్పటికీ, కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే వాటిని ఆమోదించి అమలు చేస్తున్నాయి. లిఫ్టుల్లో సేఫ్టీ గురించి దేశవ్యాప్తంగా ఏకీకృత విధానమేదీ లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నియమ నిబంధనలు అమలు అవుతున్నాయి. లిఫ్టుల్లో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే దేశవ్యాప్తంగా ఏకీకృత నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా. భారత్ లో ప్రస్తుతం లిఫ్టుల కోసం సమగ్రమైన, ప్రామాణికమైన స్వచ్ఛంద ప్రమాణాలు లేవని ఆయన చెబుతున్నారు. 

Published at : 07 Aug 2023 12:34 PM (IST) Tags: Life Problems Lift Accidents Elivator Problems Lifts Better Maintenance Latest News of Elivators

ఇవి కూడా చూడండి

Rainbow Hospitals: గుండె లోపాలు జయించిన చిన్నారులతో రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ హార్ట్ డే వేడుకలు

Rainbow Hospitals: గుండె లోపాలు జయించిన చిన్నారులతో రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ హార్ట్ డే వేడుకలు

Telangana Investments : తెలంగాణలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ భారీ పెట్టుబడులు - కేటీఆర్‌తో సమావేశమైన కంపెనీ ప్రతినిధులు !

Telangana Investments : తెలంగాణలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ భారీ పెట్టుబడులు -  కేటీఆర్‌తో సమావేశమైన  కంపెనీ ప్రతినిధులు !

Ganesh Immersion: 250 మంది పోకిరీల అరెస్ట్, మందుబాబులూ మీరే ఆలోచించుకోవాలి - సీపీ ఆనంద్

Ganesh Immersion: 250 మంది పోకిరీల అరెస్ట్, మందుబాబులూ మీరే ఆలోచించుకోవాలి - సీపీ ఆనంద్

Telangana CS: తెలంగాణ సీఎస్ శాంతి కుమారి కీలక భేటీ - ఆ అధికారులకు సహకరించాలని ఆదేశాలు

Telangana CS: తెలంగాణ సీఎస్ శాంతి కుమారి కీలక భేటీ - ఆ అధికారులకు సహకరించాలని ఆదేశాలు

Breaking News Live Telugu Updates: ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు విచారణ వాయిదా

Breaking News Live Telugu Updates: ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు విచారణ వాయిదా

టాప్ స్టోరీస్

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే

CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే

Chandrababu Naidu Arrest : చంద్రబాబు కేసుల్లో కక్ష సాధింపు లేదు - కోర్టే రిమాండ్ విధించింది - సజ్జల కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu Arrest  :  చంద్రబాబు కేసుల్లో కక్ష సాధింపు లేదు - కోర్టే రిమాండ్ విధించింది - సజ్జల కీలక వ్యాఖ్యలు