News
News
X

Himanshu Rao: బాలయ్య డైలాగ్ వేసిన కేసీఆర్ మనవడు! తక్కువ టైంలో ఎంత మార్పో, గుర్తు పట్టలేకపోతున్న నెటిజన్లు

ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన హిమాన్షు బాగా బరువు తగ్గారు. యాదాద్రి ఆలయ పున:ప్రారంభోత్సవం, ప్రగతి భవన్ లో వేడుకలు, ఇతర సందర్భాల్లో ఫోటోల్లో కనిపించిన హిమాన్షు రావులో చాలా మార్పు కనిపించింది.

FOLLOW US: 
 
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమన్షు రావు కూడా తండ్రిలాగానే సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ ఉండే సంగతి తెలిసిందే. ఈ ఏడాదే 12వ తరగతి పూర్తి చేసిన ఆయనకు ట్విటర్ లో 30 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో కూడా 30 వేలకు చేరువలో ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ అభిమానుల్లో చాలా మంది హిమాన్షును కూడా ఫాలో అవుతుంటారు.

అయితే, ఇటీవల హిమాన్షులో చాలా మార్పు కనిపించింది. గతంలో ఆయన అధిక బరువు కారణంగా నెట్టింట్లో బాడీ షేమింగ్‌కు గురైన విషయం తెలిసిందే. భారీ శారీరాకృతితో కనిపించిన హిమాన్షుపై ఆన్‌ లైన్‌లో ఎన్నో ట్రోట్స్ కూడా వచ్చాయి. ఆ మధ్య సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ కలిసినప్పుడు హిమాన్షు జగన్‌తో దిగిన ఫోటో బాగా వైరల్ అయింది. అయితే, దీనిపై కొన్ని సందర్భాల్లో తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్ తన కుమారుడిపై కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అన్న సందర్భాలూ ఉన్నాయి. కొంత మంది రాజకీయ నాయకులు కూడా ప్రెస్ మీట్లలో విమర్శించిన సందర్భాలు ఉన్నాయి.

ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన హిమాన్షు బాగా బరువు తగ్గారు. యాదాద్రి ఆలయ పున:ప్రారంభోత్సవం, ప్రగతి భవన్ లో పంద్రాగస్టు వేడుకలు, ఇతర సందర్భాల్లో ఫోటోల్లో కనిపించిన హిమాన్షు రావులో చాలా మార్పు కనిపించింది. అంతకుముందుతో పోల్చితే చాలా బరువు తగ్గారు. 

News Reels

గత నెల అక్టోబరులో ఖాజాగూడ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల కోసం యునైటెడ్ నేషన్స్ వారి సస్టెనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ అనే అంశంపై మాట్లాడే అవకాశం హిమాన్షు రావుకు వచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలను ఆయన ట్వీట్ చేయగా, అందులోనూ సన్నగా కనిపించారు.

తాజాగా, ఇప్పటి ఫోటోల్లో చూస్తే అసలు పాత ఫోటోల్లో వ్యక్తికి అస్సలు సంబంధం లేనట్లుగా కనిపిస్తున్నారు. ఓ ఫోటోను ఓ అభిమాని ట్వీట్ చేస్తూ అచ్చం కేటీఆర్ లా ఉన్నారు అంటూ ట్వీట్ చేశారు. ‘‘నేను సడెన్ గా చూసి కేటీఆర్ అన్న అనుకున్నా’’ అని ట్వీట్ చేసి హిమాన్షుని ట్యాగ్ చేశారు. దీనిపై హిమాన్షు స్పందిస్తూ ట్రెండింగ్ లో ఉన్న బాలక్రిష్ణ డైలాగ్ తో సమాధానం ఇచ్చారు.

‘‘సరిసర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరుగుతాయా ఏంటి? అని ఓ గ్రేట్ మ్యాన్ చెప్పారు.. జోక్స్ చేశా, థ్యాంక్యూ’’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. బాలకృష్ణ డైలాగ్‌ తో చేసిన పోస్ట్‌ కు బాలయ్య నా మాజాకా.. డైలాగ్‌ ఎవరైనా వాడాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Published at : 15 Nov 2022 01:19 PM (IST) Tags: KTR son Himanshu Rao Kalvakuntla KCR Himanshu news KTR Family news

సంబంధిత కథనాలు

Professor Raviranjan Suspended: హెచ్‌సీయూ ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెండ్, విద్యార్థులకు తెలిపిన రిజిస్ట్రార్!

Professor Raviranjan Suspended: హెచ్‌సీయూ ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెండ్, విద్యార్థులకు తెలిపిన రిజిస్ట్రార్!

Mahabubnagar Crime : చిన్నారిపై బాబాయ్ లే అత్యాచారం, ఆపై హత్య!

Mahabubnagar Crime : చిన్నారిపై బాబాయ్ లే అత్యాచారం, ఆపై హత్య!

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

టాప్ స్టోరీస్

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Sundar Pichai: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా నేను భారతీయుడినే - పద్మ భూషణ్‌ స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌

Sundar Pichai: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా నేను భారతీయుడినే - పద్మ భూషణ్‌ స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?