అన్వేషించండి

సుకేశ్‌కు లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్- క్షమాపణ చెప్పాలని డిమాండ్

గత కొన్ని నెలలుగా కవితను టార్గెట్ చేసిన సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఈసారి కేటీఆర్ ప్రస్తావ తీసుకొచ్చారు. ఈమేరకు గవర్నర్‌కు లేఖ రాసినట్టు కూడా ఆయన లాయర్‌ చెప్పుకొచ్చారు.

సుఖేశ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి క్రిమినల్‌ను తాను ఎప్పుడూ కలవలేదంటూనే అతనిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇలాంటివి ప్రచురించే ముందు మీడియా కూడా ఆలోచించుకోవాలని సూచించారు. 

గత కొన్ని నెలలుగా కవితను టార్గెట్ చేసిన సుఖేశ్ చంద్రశేఖర్‌ ఈసారి కేటీఆర్ ప్రస్తావ తీసుకొచ్చారు. ఈమేరకు గవర్నర్‌కు లేఖ రాసినట్టు కూడా ఆయన లాయర్‌ చెప్పుకొచ్చారు. దీనిపై కేటీఆర్‌ నుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. 

ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్‌ హెచ్చరించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని సుఖేశ్ లాయర్‌కు కేటీఆర్‌ తరుఫు లాయర్ నోటీసులు పంపించారు. లేకుంటే పరువునష్టం కేసు వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సుఖేశ్ తరఫు లాయర్‌ అనంత్‌ మాలిక్‌కు నోటీసు పంపారు. తెలంగాణ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు ఫిర్యాదు పేరుతో రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

సుఖేశ్ ఏమన్నారంటే?

మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి కవితతో పాటు కేటీఆర్‌పై కూడా ఆరోపణలు చేస్తూ లేఖ విడుదల చేశారు. ఈ సారి నేరగా తెలంగాణ గవర్నర్  తమిళసై సౌందర్ రాజన్‌కు  లేఖ రాశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై  సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. ‘‘నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉంది. ఈ ఆధారాలని ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేశా. కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశా. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నా’’ అంటూ గవర్నర్‌ తమిళసైకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు.

ఈ లేఖ అంశం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. సుఖేష్ తనపై ఆరోపణలు చేసినట్లుగా ఇప్పుడే తెలిసిందని.. ఇలాంటి వ్యక్తి గురించి తాను ఎప్పుడూ వినలేదన్నారు. అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాననని ప్రకటించారు. నోటెడ్ క్రిమినల్స్ ఇలాంటి ఆరోపణలు చేసనప్పుడు ప్రచారం చేసేటప్పుడు, పబ్లిష్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కల్వకుంట్ల కవిత, కేజ్రీవాల్ లపై ఆరోపణలు చేస్తూ చాలా సార్లు సుఖేష్ లేఖలు రాశారు కానీ.. కేటీఆర్ ప్రస్తావన మాత్రం ఎప్పుడూ చేయలేదు. తొలి సారి కేటీఆర్ ప్రస్తావన తెస్తూ లేఖ రాయడం సంచలనంగా మారింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget